ప్రొద్దుటూరు క్రై ం: స్థానిక శివాలయం వీ«ధిలోని రెడ్డి బార్ అండ్ రెస్టారెంట్‌పై మంగళవారం ఎస్టీఎఫ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎకై ్సజ్ అధికారులు తెలిపిన వివరాల మేరకు రెడ్డి బార్ అండ్ రెస్టారెంట్‌లో నీళ్లు కలిపిన మద్యం విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో విజయవాడ నుంచి వచ్చిన ఎస్టీఎఫ్ సీఐ కష్ణమూర్తి, ఎస్‌ఐ లక్ష్మినారాయణలు స్థానిక ఎకై ్సజ్ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. బార్‌లోని హనీబీ బ్రాండ్‌కు చెందిన 180 మద్యం సీసాలను ప్రాథమికంగా పరీక్షలు చేయడంతో నీళ్లు కలిపినట్లు నిర్ధారణ అయిందని సీఐ ఫణీంద్ర తెలిపారు. దీంతో మూడు కేసుల్లోని 67 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. సీసాలోని రెండు ఔన్స్‌ల మద్యాన్ని తీసి వాటి స్థానంలో నీళ్లను నింపినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు రెడ్డి బార్ అండ్ రెస్టారెంట్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను పరీక్షల నిమిత్తం కర్నూలు ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు సీఐ వివరించారు.
ఎకై ్సజ్ స్టేషన్ వద్ద పోలీసు బందోబస్తు
గతంలో ఇదే బార్‌పై ఎస్టీఎఫ్ అధికారులు దాడులు చేసినప్పుడు పెద్ద గొడవ చోటు చేసుకుంది. కొందరు అధికారులపై దాడి చేసి, వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఈ సంఘటన దష్టిలో ఉంచుకుని ఎకై ్సజ్ అధికారులు ముందు జాగ్రత్త చర్యగా త్రీ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్టేషన్ వద్దకు చేరుకొని కేసు నమోదు ప్రక్రియ పూర్తయ్యే వరకూ అక్కడే ఉన్నారు.
రెడ్డి బార్‌పై ఎస్టీఎఫ్ అధికారుల దాడులు
Published Wed, Aug 31 2016 1:45 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
Advertisement
Advertisement