కోడి పందాలపై పోలీసుల దాడి
Published Sat, Jan 16 2016 1:38 PM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM
కాణిపాకం: చిత్తూరు జిల్లా ఐరాల మండలం మద్దిపట్లపల్లె గ్రామంలో కోడిపందాల అడ్డాలపై శనివారం మధ్యాహ్నం పోలీసులు దాడి చేశారు. గ్రామ సమీపంలోని ఓ తోటలో జోరుగా సాగుతున్న పందాలపై ఎస్సై నరేష్‌బాబు ఆధ్వర్యంలో దాడి చేశారు. పందాల్లో పాల్గొన్న 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా 9 పుంజులను ఏడు బైక్‌లను స్టేషన్‌కు తరలించారు.
Advertisement
Advertisement