ఒక అమ్మాయితో ప్రేమ.. మరో యువతితో నిశ్చితార్థం | Boy Friend Cheetinig in Lover In Chittoor | Sakshi
Sakshi News home page

ఒక అమ్మాయితో ప్రేమ.. మరో యువతితో నిశ్చితార్థం

Published Sat, Apr 8 2023 12:04 PM | Last Updated on Sat, Apr 8 2023 12:04 PM

Boy Friend Cheetinig in Lover In Chittoor - Sakshi

చిత్తూరు:  ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని ఓ యువతి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. పట్టణలోని ఆజాద్‌ రోడ్డుకు చెందిన మణి కుమార్తె నక్షత్ర బెంగళూరులో డిగ్రీ చదువుతోంది. అలాగే స్థానిక జయప్రకాష్‌రోడ్డుకు చెందిన మూర్తి కుమారుడు ఆకాష్‌ తరచూ నక్షత్ర వెంటపడేవాడు. ప్రేమిస్తున్నానని చుట్టూ తిరిగేవాడు. కొన్నాళ్లకు అతడి మాటలు నమ్మిన యువతి ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న ఇరువురి కుటుంబీకులు వారి వివాహానికి అంగీకరించారు. అయితే అమ్మాయి చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేద్దామని నక్షత్ర తల్లిదండ్రులు చెప్పడంతో, ముందు నిశ్చితార్థం జరిపించారు. 

ఈ క్రమంలో ఏడాది నుంచి ఆకాష్‌ మరో యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు నక్షత్రకు తెలిసింది. దీనిపై ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. సమస్యలు పరిష్కరించుకుందామని ఒకరోజు ఆకాష్‌ తన వెంట నక్షత్రను బెంగళూరులో ఓ భవనం పైకి తీసుకెళ్లాడు. మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఆమెను కిందకు తోసేశాడు. దీంతో నక్షత్ర తీవ్రంగా గాయపడింది. కాలు విరిగిపోవడంతో వీల్‌చైర్‌కే పరిమితమైంది.  ఇదే సాకుగా చూపుతూ ఆకా‹Ù, తల్లిదండ్రులు అడ్డంతిరిగారు. నడవలేని అమ్మాయిని పెళ్లి చేసుకోలేమని తేలి్చచెప్పేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement