
సాక్షి, చిత్తపూరు : కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గొల్లగూడెంలో విషాదం చోటుచేసుకుంది. కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు కోడిపందెం శిబిరంపై దాడి చేశారు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు నూతిలో పడిపోయి మృతిచెందారు. మృతులు చిట్టూరి శ్రీనివాసరావు(20), మేకల చెన్నకేశవరావు(26)గా గుర్తించారు. పండుగ రోజుల్లో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment