‘కోడిపందాలపై కోర్టు ఆదేశాలు పాటిస‍్తాం’
విజయవాడ: కోడిపందాలపై హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని ఏపీ డీజీపీ సాంబశివరావు వెల్లడించారు. ఆయన శనివారం పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లోనే నేరాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. నేరాలను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా ఏపీ భవన్ లో మావోయిస్టుల రెక్కిపై తమకు సమాచారం లేదని మీడిమా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.