
జూబ్లీహిల్స్ లో కోడిపందాలపై దాడి
సంక్రాంతి రాకముందే కోడిపందాలు జోరందుకున్నాయి. సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్ కాలనీలో కోడిపందాలు నిర్వహిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్: సంక్రాంతి రాకముందే కోడిపందాలు జోరందుకున్నాయి. సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్ కాలనీలోని ఓ ఖాళీ ప్లాట్‌లో ఆదివారం కోడి పందాలు నిర్వహిస్తుండగా జూబ్లీహిల్స్ ఎస్‌ఐ రామన్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి ఆరుగురు పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.
కొంతకాలంగా జూబ్లీహిల్స్ రోడ్డునెం.13ఏలో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు సమాచా రం అందడంతో పోలీసులు దాడి నిర్వహించారు. పందెంలో పాల్గొన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఏడు కోడిపుంజులతో పాటు వీరి నుంచి రూ.2,500 నగదు స్వాధీనం చే సుకున్నారు. కోళ్లను పోలీసుస్టేషన్‌లో భద్రపరిచారు. నిందితులపై గే మింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న కోళ్లను సోమవారం కోర్టుకు అప్పగిస్తామని చెప్పారు.