శివపల్లిలో కోడిపందేల నిలువరింత
ఎలిగేడు: మండలంలోని శివుపల్లిలో గత కొన్నేళ్లుగా సంక్రాంతిరోజు జరుగుతున్న కోడిపందేలను నిలువరించగలిగారు. గ్రామంలోని నాలుగు దిక్కులుగా ఉండే ప్రధాన రహదారుల వెంబడి పోలీసులను మోహరించి , అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. దీంతో సంక్రాంతిరోజున నిర్వహించే కోడిపందేల బెట్టింగ్‌లను నిరోధించగలిగారు. ఎలాగైన కోడిపందేలను నిర్వహించి తీరుతామని బెట్టింగ్‌రాయుళ్లు విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.
ఐతే గ్రామంలో తుపాకులతో పోలీసుల గస్తీ, ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్తులు భయంతో ఉండగా, సంకాంత్రి రోజున కోడిపందేలు జరగకపోవడం, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు శివుపల్లి గ్రామంలో కోడిపందేలకు పేరుగాంచినప్పటికి అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వం, అధికారయంత్రాంగం కోడిపందాలను నిరోధించడం విశేషంగా జిల్లా ప్రజలు చెప్పుకుంటున్నారు. గ్రామంలో పోలీసు పికెంటింగ్ త్వరలో ఎత్తివేయనున్నట్లు ఎస్సై దేవేందర్ పేర్కొన్నారు.