
సాక్షి, విజయవాడ : సంతోషాలకు నెలవైన సంక్రాంతి పండుగ ఓ కుటుంబంలో విషాదాల్ని నింపింది. భార్య, భర్తల మధ్య దుస్తుల విషయంలో చోటుచేసుకున్న గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విజయవాడ వన్‌టౌన్ ఏరియాలో పిళ్ల అశ్విని దంపతులు నివాసముంటున్నారు. ఇంకో రెండురోజుల్లో సంక్రాంతి పండుగ ఉన్నందున ఆమె భర్త కొత్త బట్టలు కొనేందుకు నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం భార్య బంగారం తాకట్టు పెట్టి బట్టలు కొన్నాడు. ఈ విషయంపై భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది.
తన బంగారు నగలు అమ్మి భర్త దుస్తులు కొనటం, గొడవ కారణంగా ఆగ్రహానికి గురైంది. వెంటనే ఇంటి రెండో అంతస్తు మీదనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment