
సాక్షి, కృష్ణా: జిల్లాలోని విజయవాడ ప్రకాశం బ్యారేజీ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందం రెస్యూ చేసి యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం మనోజ్ అనే వ్యక్తి ప్రకాశం బ్యారేజీ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను తీవ్రమై మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విజయవాడ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఆ యువకుడికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.