
ముద్దు ముద్దుగా ఉండే కుక్కపిల్లలను చాలా మంది ఇష్టపడతారు.
కోయంబత్తూరు: ముద్దు ముద్దుగా ఉండే కుక్కపిల్లలను చాలా మంది ఇష్టపడతారు. అలాంటి ఓ కుక్కపిల్ల చేసిన ప్రయత్నం మాత్రం నెటిజన్లకు విపరీతంగా నవ్వు తెప్పిస్తోంది. వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన వ్యాపారవేత్త మురళీధరన్‌కు జంతువులంటే చాలా ఇష్టం. అందుకే ఆయన తన ఇంటి వద్ద కోళ్లు, పిల్లులు, కుక్కల్ని పెంచుతున్నారు. ఇటీవల ఆయన ఇంటి వద్ద ఉన్న ఓ రెండు కోళ్లు ఒకదానితో ఒకటి పోటీపడుతున్న క్రమంలో వీడియోను తీశారు. అందులో విశేషం ఎంటని అనుకుంటున్నారా రెండు కోళ్లు పోటీపడుతుంటే ఓ కుక్కపిల్ల మాత్రం వాటిని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. వాటితో కలిసి పెరగడం వల్లనో ఎమో తెలియదుగానీ రెండు కోళ్లను వీడదీయడానికి ఆ కుక్కపిల్ల విశ్వప్రయత్నం చేసింది. ‘కొట్టుకోవద్దు.. ప్లీజ్ ఆపండి’ అని అర్థం వచ్చేలా ఆ కొట్లాటను ఆపడానికి తన వంతు ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.