కోడి పందాలకు ‘సుప్రీం’ నో
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) :కోడి పందాలపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై యథాతథ స్థితిని కొనసాగించాలంటూ సుప్రీం కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చిందని భారత జంతు సంక్షేమ బోర్డు అధికారి శ్రేయ పరోపకారి స్పష్టం చేశారు. జిల్లాలో కోడి పందాలను అరికట్టాలని కోరుతూ సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కె.భాస్కర్, ఎస్పీ కె.రఘురామ్ రెడ్డికి వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ సంప్రదాయాల ముసుగులో కోడి పందాలు నిర్వహిస్తూ మన సంప్రదాయాలు ఇంత నీచమైనవా అని భావితరాలు అపార్థం చేసుకునే విధంగా వ్యవహరించడం దారుణమన్నారు.
రాజకీయ నాయకులు సైతం ఈ క్రీడను ప్రోత్సహిం చడం సబబు కాదన్నారు. కోడిపందాల కారణంగా ఎన్నో కోళ్లు చని పోతున్నాయని, వీటి ముసుగులో జూద క్రీడలు నిర్వహిస్తూ ప్రజల నుంచి కోట్లాది రూపాయల్ని కొల్లగొడుతున్నారని ఆమె పేర్కొన్నారు. వీటివల్ల ఎన్నో కుటుం బాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వులను యథాతథంగా అమ లు చేయూలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇస్తే, కొందరు దానిని వక్రీకరిస్తూ పూర్వ స్థితినే కొనసాగించాలని, కోడి పందాలకు అడ్డు పెట్టకూడదని ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇది పూర్తిగా అసత్య ప్రచారమన్నారు. ఈ క్రీడ జంతు సంరక్షణ చట్ట ప్రకారం, మానవతా విలువల చట్టం ప్రకా రం కూడా నిషేధమని వివరించారు.
ఇటువంటి నీచ క్రీడలను నిరోధించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, పందాలు నిర్వహించే ప్రాంతాల సమాచారాన్ని పోలీస్ శాఖకు అందించాలని కోరారు. జీవరక్ష జంతు సంక్షేమ సంఘం (రాజమండ్రి) వ్యవస్థాపకుడు ఆచార్య మాట్లాడుతూ కోడిపందాల వల్ల కలిగే ఆనందం కంటే నష్టాలే ఎక్కువనే విషయూన్ని ఒక్కరూ గ్రహించాలన్నారు. లక్షలాది కోళ్లను చంపుతూ ఆనందించే ఈ క్రీడ వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ప్రజలంతా ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. పండగ మూడు రోజుల్లోనే ప్రజలు వందలాది కోట్ల రూపాయలను, విలువైన ఆస్తులను కోల్పోతున్నారని తెలిపారు.