టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం | Anchor Rashmi Gautam Angry On Netizen Who Throws A Dog Into Canal | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం

Published Tue, Apr 7 2020 7:44 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

టిక్‌టాక్ కోసం మ‌నుషులు త‌మ ప్రాణాల‌ను లెక్క‌చేయ‌కుండా వీడియోలు చేస్తుండ‌టం చూశాం. కానీ కొంత‌మంది వ్య‌క్తులు వారు ఫేమ‌స్ అవ‌డానికి జంతువుల‌ను ఆయుధంగా వాడుకుంటున్నారు. వాటితో విన్యాసాలు చేయిస్తూ, హింసిస్తూ రాక్ష‌సానందం పొందుతున్నారు. తాజాగా ఓ టిక్‌టాక్ యూజ‌ర్ జంతువుల ప‌ట్ల నిర్ద‌య‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న వీడియో యాంకర్ ర‌ష్మీ గౌత‌మ్ కంట్లో ప‌డింది. న‌రేశ్ అనే ఐడీ పేరుతో ఉన్న టిక్‌టాక్ వీడియోలో ఓ వ్య‌క్తి కుక్క పిల్ల‌ను ప‌ట్టుకుని నిల్చున్నాడు. కెమెరా వైపు చూసి అత‌ని స్నేహితుడు ఓకే చెప్ప‌గానే నిర్దాక్షిణ్యంగా ఆ కుక్క‌పిల్ల‌ను కాలువలోకి పడేశాడు. 

పాపం.. ఆ మూగ‌ప్రాణి బ‌తుకుజీవుడా అని ఈదుకుంటూ ఎలాగోలా ఒడ్డుకైతే రాగ‌లిగింది. అత‌ని చేతిలో ఉన్న జంతువు ప‌రిస్థితి త‌ల్చుకున్న ర‌ష్మీకి మ‌న‌స్సు చివుక్కుమంది. "అందుకే మ‌నుషులు అంత‌రించేందుకు అర్హుల‌వుతున్నారు" అంటూ తీవ్ర‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. జంతువుల ప‌ట్ల క్రూరంగా వ్య‌వ‌హ‌రించిన వ్య‌క్తిపై చ‌ర్య‌లు తీసుకోండంటూ జంతు ప్రేమికురాలైన బీజేపీ నేత మేన‌కా గాంధీకి ఫిర్యాదు చేసింది. కాగా ఈ వీడియోపై జంతు ప్రేమికులు సైతం తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. "కుక్క‌ ప్రాణాల‌తో చెల‌గాటం ఆడేందుకు సిగ్గు లేదా?" అని కామెంట్లు చేస్తున్నారు. టిక్‌టాక్ ఐడీ ఆధారంగా అత‌ని జాడ‌ను వెతికే ప‌నిలో ప‌డ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement