
కరోనా ఎఫెక్ట్‌తో షూటింగ్‌లకు తాత్కాలికంగా విరామం దొరకడంతో హీరోలు, హీరోయిన్లు ఇళ్ల దగ్గరే తమకు నచ్చిన వ్యాపకాలతో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన పెంపుడు కుక్కలతో టైం పాస్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు విజయ్. ఇప్పటికే ఈ ఫోటోను 1.7 మిలియన్ల మంది లైక్ చేశారు. దీనిలో విజయ్ తన పెంపుడు కుక్కలు స్టార్మ్, చెస్టర్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ‘చిల్లింగ్ విత్ దిస్ బాయ్స్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. గత నెల తొలిసారి స్టార్మ్ ఫోటోను షేర్ చేశారు విజయ్. (అవకాశాలు అంత తేలికకాదు..)
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమాలో నటిస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment