
లండన్: సాధారణంగా కుక్క ఐదు నుంచి ఆరు పిల్లలకు జన్మనిస్తుంది. తల్లి కుక్క వయసు ఆధారంగా కూడా పిల్లల సంఖ్య మారుతుందట. కానీ శునకం గరిష్టంగా 15 మందికి జన్మనివ్వగలదు. అయితే అనూహ్యంగా ఓ కుక్క మాత్రం ఒకే కాన్పులో 18 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన ఇంగ్లండ్‌లోని ప్రిస్టన్‌లో చోటు చేసుకుంది. మూడేళ్ల వయసున్న డాల్మటియన్ జాతి కుక్క నెల్లీ ఒకే కాన్పులో 10 మగ కుక్కలతోపాటు, ఎనిమిది ఆడ కుక్కలను జన్మనిచ్చింది. (ఇంతకీ పులి చిక్కిందా.. లేదా!)
ఇవి ఉండాల్సిన పరిమాణం కన్నా రెట్టింపు సైజులో ఉండటం గమనార్హం. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయని వైద్యులు చెప్పుకొస్తున్నారు. ఇక నెల్లీ యజమాని లూయిస్ అప్పుడే పుట్టిన ఒక్క కుక్కపిల్ల మినహా మిగతా అన్నింటినీ దత్తత ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కాగా అత్యధిక మందికి జన్మనిచ్చిన రికార్డు మాత్రం ఇంగ్లండ్‌లోని టియా కుక్క పేరు మీద ఉంది. ఇది 2014 నవంబర్‌లో ఒకే కాన్పులో 24 మందిని కన్నది. (మొదటిసారి డేటింగ్‌కు వెళుతున్నాడు అందుకే..)
Comments
Please login to add a commentAdd a comment