న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన తల్లి సోనియాగాంధీకి ఒక సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఒక బుజ్జి కుక్క పిల్లను కానుకగా ఇచ్చారు. ఆ కుక్క పిల్లకి నూరీ అని పేరు పెట్టారు. బుధవారం ప్రపంచ జంతు దినోత్సవాన్ని పురస్కరించుకొని తల్లి సోనియాకు కుక్కపిల్లని ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇదంతా వీడియో తీసి యూట్యూబ్‌లో ఉంచారు.
అమ్మకి ఒక సర్‌ప్రైజ్ అంటూ రాహుల్ గాంధీ సోనియాను బయటకు తీసుకురావడంతో వీడియో మొదలవుతుంది. రాహుల్ ఇచ్చిన బాక్స్ తీసి చూసిన సోనియా గాంధీ అందులో బుజ్జి కుక్క పిల్ల ఉండడంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు. చాలా క్యూట్‌గా ఉందంటూ మురిసిపోయారు. ఇప్పుడు తమ కుటుంబంలోకి మరో సభ్యురాలు వచ్చిందంటూ రాహుల్ చెబుతున్నారు. జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన ఈ ఆడకుక్క పిల్లను రాహుల్ గోవా నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment