
లాక్‌డౌన్ వల్ల మనుషులేనా, మూగజీవాలు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. పార్కుల వెంట పరుగులు తీయడం, రోడ్ల వెంట తోకూపుతూ నడవటం, మిగతా జీవులనూ రెచ్చగొడుతూనే యజమానుల ముందు ఏమీ తెలియనట్లు మొహం పెడుతూ కాళ్ల అతనిచ్చే బిస్కట్ కోసం బంతాట ఆడటం, అంతెంతుకు.. వీధి చివర తన ప్రేయసి/ప్రియుడుతో ఆటలాడటం ఇలా ఎన్నింటినో శునకాలు కూడా మిస్ అవుతున్నాయి. బిగ్ పొప్ప అనే మూడేళ్ల ఇంగ్లిష్ బుల్‌డాగ్ కూడా వీటి గురించే దీర్ఘాలోచనలో పడినట్లుంది. పాపం విచారంగా తల కిందికేసి చూస్తున్న దాని ఫొటోను యజమాని రే ఎల్లీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. (కరోనా : అమ్మా! మీ సేవకు సలాం)
"ఇవాళెందుకో నా కుక్కపిల్ల బాధగా కనిపిస్తోంది. బహుశా పిల్లలతో కలిసి ఆడుకోలేకపోతున్నందుకు కావచ్చు" అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇంకేముందీ, నెటిజన్లు అచ్చంగా ఆ కుక్క పరిస్థితే తమది కూడా అంటూ దాని ఫీలింగ్‌ను షేర్ చేసుకుంటున్నారు. కుక్కపిల్లపై సానుభూతి వర్షం కురిపిస్తున్నారు. అలా ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాని యజమానురాలు రే ఎల్లీ మాట్లాడుతూ.. దానికి అన్నింటికన్నా పిల్లలే ఇష్టమని, వాటితో ఆడుకుంటే పొప్పకు ఎక్కడలేని సంతోషమని చెప్పుకొచ్చింది. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల అది సాధ్యం కావట్లేదని పేర్కొంది. (మొసలికి ఊపిరాడకుండా చేసి..)