
అది అమెరికాలోని కాలిఫోర్నియా.. పామ్ ఎడారిలో బర్కింగ్‌హమ్ అనే హోటల్.. సకల సదుపాయాలతో విలాసవంతంగా ఉంటుంది. ఈ హోటల్‌కో ప్రత్యేకత ఉంది.. ఏంటో తెలుసా.. అందులో మీ పెంపుడు కుక్కపిల్లల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంది. పొద్దున మీ కుక్క నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు మహారాజులా చూసుకుంటారు.
వాటి కోసం ప్రత్యేకమైన సూట్ గదులుంటాయి. అందులో ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు ఏది కావాలంటే ఆ వంటకాలను ప్రత్యేకంగా తయారుచేసి అందిస్తారు. భోజనం చేసిన తర్వాత కసరత్తులు చేసేందుకు ప్రత్యేకమైన జిమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. జిమ్ చేయడం నచ్చకపోతే వాటికోసం స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది.
ఆ తర్వాత వాటికి జుట్టు కత్తిరించాలనుకుంటే కూడా వాటికోసం హెయిర్‌సెలూన్ కూడా ఉంది. మడ్ బాత్.. చర్మం నిగనిగలాడేందుకు ప్రత్యేకమైన స్నానాలే కాదు.. శరీరానికి మసాజ్ చేస్తారు. అంతెందుకు మీ కుక్క పిల్లల అందం కోసం పలు రకాల ఫేస్ ప్యాక్‌లు కూడా ఉన్నాయి. పడుకునేందుకు మెత్తటి పరుపులు ఏర్పాటుచేశారు. ఇప్పుడు ఇలాంటి హోటళ్లకు అమెరికాలో తెగ గిరాకీ ఉందట.
Comments
Please login to add a commentAdd a comment