మెక్సికోకు టర్కీ మూడు నెలల వయసున్న జర్మనీ షెపర్డ్ కుక్కపిల్లను ఇచ్చించి. ఈ మేరకు మెక్సికో సైన్యం బుధవారం టర్కీ గిఫ్ట్‌గా ఇచ్చిన ఆ కుక్క పిల్లను స్వాగతించింది. అసలు టర్కీ ఎందుకు ఆ కుక్కపిల్లనే గిఫ్ట్‌గా ఇచ్చిందంటే..ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి నెలలో టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకృతి విలయతాండవానికి వేలాదిగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నాటి ఘటనలో భూకంప శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు మెక్సికో రెస్క్యూ డాగ్‌లతో మోహరించింది.
ఆ టర్కీ రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రొటీయో అనే జర్మన్ షెషర్డ్ జాతికి చెందిన కుక్క చాలా చురుకుగా సేవలందించింది. ఐతే అది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయింది. ఈ జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్క భూకంపాలు, ప్రకృతి వైపరిత్యాలకు గురయ్యే ప్రదేశంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఆయా ప్రదేశంలోని శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారి ఆచూకిని కనిపెట్టడంలో ప్రసిద్ధి చెందింది. దీంతో టర్కీ ఆ జాతికి చెందిని మూడు నెలల వయసున్న కుక్క పిల్లను విధి నిర్వహణలో ప్రాణాలొదిలేసిన కుక్క పిల్లకు బదులుగా మెక్కికోకు గిఫ్ట్‌గా ఇచ్చింది.
ఆ కుక్కపిల్లకు 'ఆర్కాదాస్‌గా' నామకరణం
ఈ కుక్కపిల్లకు మెక్కికో సైన్యం స్వాగతం పలకడమే గాక ఆర్కాదాస్ అని పేరుపెట్టింది. టర్కిష్‌లో ఆర్కాదాస్ అంటే స్నేహితుడు అని అర్థం. మృతి చెందిన ప్రోటియోని సంరక్షించిన ట్రెయినరే ఆర్కాదాస్‌కి కూడా శిక్షణ ఇస్తారని మెక్సికో సైన్యం తెలిపింది. ఈ మేరకు సదరు కుక్కపిల్ల గ్రీన్‌కలర్ సైనిక యూనిఫాం ధరించి బుధవారం మెక్సికో సైనిక స్థావరంలో జరుగుతున్న అధికారిక వేడుకలో పాల్గొంది. సరిగ్గా మెక్కికో జాతీయ గీతం స్పీకర్ల నుంచి వస్తుండగా.. ఒక్కసారిగా ఆ కుక్కపిల్ల ఉద్వేగభరితంగా మొరిగి తన విశ్వాసాన్ని చాటుకుంది.
ఈ నేపథ్యంలో మెక్కికో రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్కాదాస్ తరుఫున ఒక ట్వీట్ కూడా చేసింది. ఆ ట్వీట్‌లో.."నన్ను ఎంతో ఆప్యాయంగా స్వాగతించిన మెక్సికోకు చెందిన స్నేహితులకు ధన్యవాదాలు. రెస్క్యూ డాగ్‌గా ఉండేందుకు నావంతుగా కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను ". అని పేర్కొంది రక్షణ శాఖ. కాగా, టర్కీ రెస్క్యూ ఆపరేషన్‌లో మరణించిన ప్రోటీయో కుక్కుకు మెక్కికో ఘనంగా సైనిక అంత్యక్రియలు నిర్వహించి నివాళులర్పించింది.
(చదవండి: మరో ఆప్షన్ లేదు.. లొంగిపోతానన్నా వినొద్దు.. జెలెన్‌స్కీని మట్టుబెట్టాల్సిందే!)
Comments
Please login to add a commentAdd a comment