కుక్క పిల్లను పెంచుకుంటున్న కోతి | Monkey adopts puppy, both go viral online | Sakshi
Sakshi News home page

కుక్క పిల్లను పెంచుకుంటున్న కోతి

Published Sat, Jan 23 2016 11:24 AM | Last Updated on Fri, Jul 26 2019 5:59 PM

Monkey adopts puppy, both go viral online

న్యూఢిల్లీ: కోతి ఓ కుక్కపిల్లను అక్కున చేర్చుకోవడం అందరిని ఆకట్టుకుంటోంది. ఆశ్రయం లేకుండా వీధుల్లో తిరుగుతున్న ఓ కుక్కపిల్లను తన సొంత బిడ్డలా ఓ కోతి పెంచుతోంది. ఈ సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటు చేసుకుంది.

ఇతర కుక్కలు ఆ బుల్లికుక్కపై దాడి చేయడానికి వస్తే ఆ కోతి కాపాడుతోంది. అంతే కాకుండా తను సేకరించిన ఆహారాన్ని కుక్క పిల్ల తిన్న తర్వాతే ఆకోతి తింటోంది. ఇప్పుడు ఆ కోతి, కుక్కపిల్లల ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కోడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement