ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్ నీరజ్ చోప్రాకు తొలి వ్యక్తిగత స్వర్ణం గెలిచిన షూటర్ అభినవ్ బింద్రా తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చాడు. ఈ సందర్భంగా నీరజ్‌ను అభినందించిన బింద్రా.. .తన తరఫునుంచి ‘టోక్యో’ పేరు గల కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చి దానికి తోడుగా ‘పారిస్’ను తీసుకురావాలని ఆకాంక్షించాడు.
వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్ ఫైనల్లో సురేఖ బృందం
యాంక్టాన్ (యూఎస్‌ఏ): వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో వెన్నం జ్యోతి సురేఖ సభ్యురాలిగా ఉన్న భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. కాంపౌండ్ విభాగంలో సురేఖ, ముస్కాన్ కిరార్, ప్రియ గుర్జర్ లతో కూడిన జట్టు సెమీ ఫైనల్లో 226–225 తేడాతో అమెరికాపై విజయం సాధించింది. శుక్రవారం జరిగే ఫైనల్లో కొలంబియాతో భారత్ తలపడుతుంది. అంతకు ముందు భారత జట్టు... ప్రిక్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్‌పై, క్వార్టర్ ఫైనల్లో గ్రేట్ బ్రిటన్‌పై గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment