
బీజింగ్ : చైనాలో ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. ఓ పర్వత ప్రాంతంలో దిక్కూమొక్కు లేకుండా తిరుగుతున్న ఓ కుక్కపిల్లలాంటి జంతువుపై జాలిపడి ఇంటికి తెచ్చి పెంచిన అతడు షాక్ తిన్నాడు. ఎందుకంటే అది పెరిగి పెద్దదై ఎలుగుబంటిగా మారింది. అప్పుడుగానీ అతడికి అర్ధం కాలేదు.. తాను తీసుకొచ్చి పెంచుకుంది ఓ ఎలుగు బంటి పిల్లను అని. చిన్నపిల్లగా ఉన్నప్పుడు తాను ఇంటికి తీసుకొచ్చానని, దానికి పాలు, కార్న్ తదితర ఆహార పదార్థాలు పెట్టినట్లు తెలిపాడు.
అయితే, ఎనిమిది నెలల్లోనే అది 1.7 మీటర్లు పెరిగిందని, 80 కేజీల బరువుతో పూర్తి ఎలుగుబంటి రూపంలోకి వచ్చిందని చెప్పారు. తన ఇంట్లో ఉన్న కుక్క పిల్ల అది కలిసి పెరిగాయని, చాలా చక్కగా ఆడుకునేవని తెలిపాడు. అయితే, పెద్దయ్యాక దానితో ఇతరులకు ఎలాంటి ప్రమాదం రాకుడదని గొలుసులతో కట్టేసి దానికి ప్రత్యేక బోనును తయారుచేసి పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు దానిని అలా బోనులో పెట్టి ఇంట్లో ఉంచి నేరం అవుతుందని చెప్పడంతో వారికి అప్పగించారు. దాంతో దానిని వన్యమృగప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment