వైరల్‌: కుక్కపిల్లను కొత్త పెళ్లికూతురిలా.. | Viral Puppy Welcomed Like A Bride | Sakshi
Sakshi News home page

పప్పీ! నీ అడుగులు పదిలమవ్వాలి..

Published Mon, Jun 15 2020 2:42 PM | Last Updated on Mon, Jun 15 2020 2:52 PM

Viral Puppy Welcomed Like A Bride - Sakshi

వీడియో దృశ్యాలు

కొత్తగా కుక్కపిల్లను ఇంటికి తీసుకురావటమంటే శునక ప్రేమికులకు చెప్పలేనంత ఆనందం. ఆ ఆనందాన్ని తమకు తోచినట్లుగా తెలియజేస్తూ ఉంటారు. కొంతమందైతే దాన్నో వేడుకలా జరుపుకుంటారు. ఫ్లోరిడాకు చెందిన ఓ కుటుంబం అయితే ఓ కొత్త పెళ్లికూతుర్ని ఇంటికి ఆహ్వానించినట్లు కుక్కపిల్లను స్వాగతించింది. కొత్తగా ఇంటికి తెచ్చుకుంటున్న కుక్కపిల్లకు బెంజీ పాటెల్‌ అని పేరు పెట్టి, హారతి ఇచ్చి, ఎర్రనీళ్లతో దాని అడుగులను పదిలం చేసి మరీ ఇంట్లోకి ఆహ్వానించారు కుటుంబసభ్యులు. ఈ వీడియోకు ‘కబీ ఖుషీ కబీ గమ్’‌ బ్యాంక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ను జోడించి టిక్‌టాక్‌లో విడుదల చేశారు. దీంతో వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. (క్షమించు సుశాంత్‌: సన్నీ లియోన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement