లండన్: ఆ తల్లికి కుక్కపిల్లలంటే ఎంతో ఇష్టం. ఆమె బిడ్డకు శునకాలంటే పిచ్చి. వెరసి తల్లీకూతుళ్లిద్దరూ విచిత్రంగా ప్రవర్తిస్తూ వార్తల్లోకెక్కారు. వినడానికి వింతగా ఉన్న ఈ అలవాటు చాలా ఏళ్ల నుంచి జరుగుతూ వస్తోందట. యూకేకు చెందిన 68 ఏళ్ల మెర్సియాకు 21 ఏళ్ల కూతురు అలినా. ఎంజైమ్ లోపంతో బాధపడుతున్న ఆమెను దత్తత తీసుకున్నప్పటికీ మెర్సియా సొంతబిడ్డకన్నా ఎక్కువగా చూసుకుంటుంది. (కరోనాతో ఆస్పత్రికి.. కట్ చేస్తే పెళ్లి)
అయితే అలినాకు కుక్కపిల్లలు పెంచుకోవాలన్నది ఆశ. కానీ అది కుదరలేదు. దీంతో ఆమె తల్లే కుక్కపిల్లలా అవతారం ఎత్తింది. కూతురును నాకుతూనే మెర్సియా నిద్రలేపుతుంది. లేకపోతే ఆమె అస్సలు లేవదట. ఇలా చేయడానికి ముందు ఆమె కుక్కపిల్లలా శబ్ధాలు చేస్తూ కూతురిని సంతోషపెడుతుంది. ఈ దినచర్య కొన్నేళ్ల నుంచి జరుగుతూ వస్తోంది. తల్లి తనను నాకుతూ నిద్ర లేపడం మహా ఇష్టమని ముసిముసి నవ్వులు నవ్వుతోంది అలినా. ఖాళీ సమయాల్లో ఇలా ఒకరినొకరు నాకుతూ కుక్కపిల్లల్లా ఆడుకుంటామని ఈ తల్లీకూతుర్లు చెప్పుకొస్తున్నారు (ఇంతకంటే దారుణమైన ప్రమాదం ఉండదు.. కానీ!)
Comments
Please login to add a commentAdd a comment