
ఈ ఫొటోలో ఉన్న కుక్క పిల్లను చూడగానే ఠక్కున ఏం గుర్తొస్తుంది..? కార్టూన్లు చూసే పిల్లలెవరైనా మిక్కీ మౌస్ అని చెప్పేస్తారు. గోళీల్లాంటి నల్లటి కళ్లు.. తెల్లటి వెంట్రుకలతో చూడముచ్చటగా ఉన్న ఈ కుక్క పేరు గోమా. నాలుగేళ్ల వయసున్న ఈ గోమా జపాన్‌లోని టోక్యోలో ఉంటుంది.
అంత అందంగా ఉంది కదా అని.. దీని యజమాని ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్‌లో గోమాకు ఖాతా కూడా తెరిచాడు. ఇంకేముంది ఇక గోమాకు అభిమానుల సంఖ్య బీభత్సంగా పెరిగిపోయింది. ఇప్పటివరకు దాదాపు 60 వేల మంది ఫాలోవర్లు ఉన్నారట. అమెరికాలో దీని గురించి తెలిసి చాలా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత గోమును ఫాలోవర్లు ‘మిక్కీ మౌస్ డాగ్’ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.