
ఆకలైతే చెప్పేస్తుంది..
లండన్: మీ పెంపుడు కుక్కపిల్లకు ఆకలిగా ఉంది.. లేదా ఏదో సమస్యతో బాధపడుతోంది.. పనిలో బిజీగా ఉన్న మీకు ఈ విషయం తెలియదు.. మరెలా? జస్ట్ ‘ది పెట్‌పేస్ స్మార్ట్ కాలర్’ను మీ పెంపుడు కుక్క మెడకు పెట్టేస్తే చాలు.. దానికి ఆకలైనా, ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నా.. మీ ఫోన్‌కు మెసేజ్ వచ్చేస్తుంది. బ్రిటన్‌లోని బర్లింగ్‌టన్‌కు చెందిన పెట్‌పేస్ సంస్థ తయారు చేసిన ఈ స్మార్ట్ కాలర్... ఎప్పటికప్పుడు పెంపుడు జంతువుల శరీర ఉష్ణోగ్రతను, గుండె కొట్టుకునే వేగం, శ్వాసక్రియను పరిశీలిస్తుంది.
వీటితోపాటు అవి ఏదైనా నొప్పితో బాధపడుతుంటే గుర్తించి.. యజమాని ఫోన్‌కు మెసేజ్ పంపుతుంది. ఈమెయిల్‌కూడా చేస్తుంది. పెంపుడు జంతువులను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండలేనివారికి ఈ స్మార్ట్ కాలర్ ఎంతగానో తోడ్పడుతుందని పెట్‌పేస్ సంస్థ పశు శాస్త్రవేత్త అసఫ్ డాగన్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్కెట్లో ప్రవేశపెట్టనున్న దీని ధరెంతో తెలుసా.. దాదాపు రూ. 10 వేలు మాత్రమే.