సాధారణంగా సీతాకోకచిలుకలు చెట్ల, జంతువులు మీద వాలుతూ గాల్లో ఎగురుతుంటాయి. గార్డెన్, మైదానాల్లో తిరుగుతూ మనుషులకు దగ్గరగా వస్తుంటాయి. మనం వాటిని పట్టుకోవాలని ప్రత్నించగానే రివ్వున గాల్లోకి ఎగిరిపోతాయి. అయితే తాజాగా ఓ సీతాకోకచిలుక చిన్న కుక్కపిల్లతో చేసిన సందడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది. ఈ వీడియోను బ్యూటెంజిబిడెన్ పేరుతో ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో చిన్న కుక్కపిల్ల బంతిని తన నోటితో ఒక చోటు నుంచి మరోచోటుకి తీసుకువస్తుంది. అదే సమయంలో రెండు సీతాకోకచిలుకలు కుక్కపిల్లలో ఆడుకుంటాయి. ఒక సీతాకోకచిలుక కుక్కపిల్ల ముక్కు మీద వాలుతుంది. అది గ్రహించిన కుక్కపిల్ల వెంటనే దాన్ని పట్టుకోవాలని ప్రత్నించగానే గాల్లోకి ఎగిరి ఆటపట్టిస్తుంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోను వీక్షించిన నెటిజన్లు.. ‘సూపర్‌గా ఉంది వీడియో!! బుజ్జి కుక్క పిల్ల తీసుకోచ్చిన బంతి కదలకుండా ఉంది. కానీ, సీతాకోకచిలుక మాత్రం గాల్లో ఎగిరింది’.. ‘ ప్రశాంతమైన గార్డెన్‌లో.. చాలా అద్భుతంగా ఉంది వీడియో’.. ‘కుక్కపిల్లలో సీతాకోకచిలుక చిలపి ఆట బాగుంది’ అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 10 లక్షల మంద వీక్షించారు.
This is what Twitter is meant for.. pic.twitter.com/wY8r1IWyrw
— Buitengebieden (@buitengebieden_) September 2, 2021
Comments
Please login to add a commentAdd a comment