సాక్షి, న్యూఢిల్లీ : థాయ్‌లాండ్‌లోని చాకోయెంగ్‌సావోలో అదివారం నాడు ఒంటి కంటితో ఓ కుక్కపిల్ల చిత్రంగా పుట్టింది. మినియన్స్ కార్టూన్ సినిమాలో కార్టూన్‌లాగా ఆ కుక్కపిల్ల ఉండడంతో ‘మినియన్స్ కెవిన్’ అని పేరు పెట్టారు. ఒంటి కన్నుతో పుట్టినప్పటికీ పూర్తి ఆరోగ్యంతో ఉండడంతో ఇంటి యజమాని సోమ్‌జాయ్ ఫుమ్మామాన్ (45) బాటిల్ పాలతో చంటి పిల్లాడిలా సాకుతున్నారు.
ఆదివారం రెండో తేదీన యజమాని పెంచుకుంటున్న ఆస్పిన్ కుక్క రెండు కుక్క పిల్లలకు జన్మనివ్వగా అందులో ఓ కుక్క పిల్ల ఒంటి కన్నుతో వింతగా పుట్టింది. ఆ కుక్క పిల్లను చూసేందుకు ఇరుగు పొరుగు ప్రాంతాల నుంచి ఎంతో మంది వచ్చి చూసి పోతున్నారట. కుక్క పిల్ల అలా పుట్టడం ఇంటికి అదృష్టమని, అది పుట్టిన వేళ, ఇంకా విశేషమైనదని, ఆ తేదీని అదృష్ట తేదీగా పరిగణించాలంటూ ఇరుగుపొరుగు వారు చెబుతున్నారని ఆ ఇంటి యజమాని కూతురు పార్న్ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment