one eye
-
ఒంటి కన్నుతో బహు ముచ్చటగా..
-
ఒంటి కన్నుతో బహు ముచ్చటగా..
సాక్షి, న్యూఢిల్లీ : థాయ్‌లాండ్‌లోని చాకోయెంగ్‌సావోలో అదివారం నాడు ఒంటి కంటితో ఓ కుక్కపిల్ల చిత్రంగా పుట్టింది. మినియన్స్ కార్టూన్ సినిమాలో కార్టూన్లాగా ఆ కుక్కపిల్ల ఉండడంతో ‘మినియన్స్ కెవిన్’ అని పేరు పెట్టారు. ఒంటి కన్నుతో పుట్టినప్పటికీ పూర్తి ఆరోగ్యంతో ఉండడంతో ఇంటి యజమాని సోమ్జాయ్ ఫుమ్మామాన్ (45) బాటిల్ పాలతో చంటి పిల్లాడిలా సాకుతున్నారు. ఆదివారం రెండో తేదీన యజమాని పెంచుకుంటున్న ఆస్పిన్ కుక్క రెండు కుక్క పిల్లలకు జన్మనివ్వగా అందులో ఓ కుక్క పిల్ల ఒంటి కన్నుతో వింతగా పుట్టింది. ఆ కుక్క పిల్లను చూసేందుకు ఇరుగు పొరుగు ప్రాంతాల నుంచి ఎంతో మంది వచ్చి చూసి పోతున్నారట. కుక్క పిల్ల అలా పుట్టడం ఇంటికి అదృష్టమని, అది పుట్టిన వేళ, ఇంకా విశేషమైనదని, ఆ తేదీని అదృష్ట తేదీగా పరిగణించాలంటూ ఇరుగుపొరుగు వారు చెబుతున్నారని ఆ ఇంటి యజమాని కూతురు పార్న్ చెబుతున్నారు. -
ఒంటి కన్నుతో జన్మించిన శిశువు
కైరో: ఓ శిశువు ఒంటి కన్నుతో జన్మించిన ఈ సంఘటన ఈజిప్ట్‌లో చోటుచేసుకుంది. నుదురు మధ్యభాగంలో ఓ కన్ను మాత్రమే ఉంది. కాగా గర్భధారణ సమయంలో శిశువు తల్లి రేడియోషన్ ప్రభావానికి గురి కావడం వల్లే.. ఇలా జన్మించి ఉండవచ్చని డాక్టర్లు భావిస్తున్నారు. చాలా అరుదుగా సంభవించే ఇలాంటి పరిస్థితిని వైద్య పరిభాషలో సైక్లోపీడియా అంటారు. మొహంలో కేవలం కన్ను, పెదాలతో జన్మించిన ఆ శిశువు కొద్ది రోజులు మాత్రమే జీవించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ముక్కు, కనురెప్పలు లేకుండా పలు వైకల్యాలతో జన్మించిన ఆ వింత శిశువుకు ప్రస్తుతం ఈజిప్టులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
ఫోటో తీస్తే.. కన్ను పోయింది!
ముద్దుగా ఉన్నాడు కదా అని మూడు నెలల బాబు(వివరాలు గోప్యంగా ఉంచారు)ను దగ్గర్లో నుంచి ఫోటో తీయడంతో ఒక కన్ను పోయింది. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. తెలిసిన బందువు ఒకాయన మొబైల్ ఫోన్ ఫ్లాష్ ఆఫ్ చేయడం మర్చిపోయి 10 ఇంచుల సమీపంలో నుంచి క్లోజ్అప్లో ఫోటో తీశాడు. ఫ్లాష్ నుంచి వచ్చిన కిరణాలు ఆ పసికందు కుడి కంటిలోని రెటీనా(మక్యులాలోని సెల్)పై దగ్గర నుంచి పడ్డాయి. ఆ తర్వాత బాలుడి కంటి దగ్గర తేడాను గమనించిన తల్లిదండ్రులు వెంటనే డాక్టర్లను సంప్రదించారు. ఫోటో దగ్గర నుంచి తీయడంతో ఫ్లాష్ వెలుతురు పడటంతో కుడి కంటిచూపును శాశ్వతంగా కోల్పొయాడని డాక్టర్లు చెప్పారు. సర్జరీ ద్వారా కూడా ఆ కంటి చూపును తిరిగి తీసుకు రాలేమని స్పష్టం చేశారు. ఈ సంఘటన ప్రభావంతో ఆ పసికందు ఎడమ కంటి చూపు కూడా మందగించిందన్నారు. పసి పిల్లల వయసు నాలుగేళ్లు వచ్చే వరకు కంటిలోని మాక్యులా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందదని, అప్పటి వరకు ఎలాంటి బలమైన కాంతికిరణాలను కంటిలో పడకుండే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.