ఒంటి కన్నుతో జన్మించిన శిశువు
కైరో: ఓ శిశువు ఒంటి కన్నుతో జన్మించిన ఈ సంఘటన ఈజిప్ట్లో చోటుచేసుకుంది. నుదురు మధ్యభాగంలో ఓ కన్ను మాత్రమే ఉంది. కాగా గర్భధారణ సమయంలో శిశువు తల్లి రేడియోషన్ ప్రభావానికి గురి కావడం వల్లే.. ఇలా జన్మించి ఉండవచ్చని డాక్టర్లు భావిస్తున్నారు. చాలా అరుదుగా సంభవించే ఇలాంటి పరిస్థితిని వైద్య పరిభాషలో సైక్లోపీడియా అంటారు.
మొహంలో కేవలం కన్ను, పెదాలతో జన్మించిన ఆ శిశువు కొద్ది రోజులు మాత్రమే జీవించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ముక్కు, కనురెప్పలు లేకుండా పలు వైకల్యాలతో జన్మించిన ఆ వింత శిశువుకు ప్రస్తుతం ఈజిప్టులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.