ఫోటో తీస్తే.. కన్ను పోయింది!
ముద్దుగా ఉన్నాడు కదా అని మూడు నెలల బాబు(వివరాలు గోప్యంగా ఉంచారు)ను దగ్గర్లో నుంచి ఫోటో తీయడంతో ఒక కన్ను పోయింది. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. తెలిసిన బందువు ఒకాయన మొబైల్ ఫోన్ ఫ్లాష్ ఆఫ్ చేయడం మర్చిపోయి 10 ఇంచుల సమీపంలో నుంచి క్లోజ్అప్లో ఫోటో తీశాడు. ఫ్లాష్ నుంచి వచ్చిన కిరణాలు ఆ పసికందు కుడి కంటిలోని రెటీనా(మక్యులాలోని సెల్)పై దగ్గర నుంచి పడ్డాయి. ఆ తర్వాత బాలుడి కంటి దగ్గర తేడాను గమనించిన తల్లిదండ్రులు వెంటనే డాక్టర్లను సంప్రదించారు. ఫోటో దగ్గర నుంచి తీయడంతో ఫ్లాష్ వెలుతురు పడటంతో కుడి కంటిచూపును శాశ్వతంగా కోల్పొయాడని డాక్టర్లు చెప్పారు. సర్జరీ ద్వారా కూడా ఆ కంటి చూపును తిరిగి తీసుకు రాలేమని స్పష్టం చేశారు. ఈ సంఘటన ప్రభావంతో ఆ పసికందు ఎడమ కంటి చూపు కూడా మందగించిందన్నారు.
పసి పిల్లల వయసు నాలుగేళ్లు వచ్చే వరకు కంటిలోని మాక్యులా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందదని, అప్పటి వరకు ఎలాంటి బలమైన కాంతికిరణాలను కంటిలో పడకుండే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.