
లూసీకి సీమంతం చేస్తున్న పళనివేల్ కుటుంబీకులు
అన్నానగర్: కడలూరు జిల్లా శ్రీముష్ణం తాలూకా కవలక్కుడి గ్రామానికి చెందిన పళనివేల్, అంబుజ వల్లి దంపతుల కుమార్తె పవిత్ర. ఈమె ఒక కుక్కపిల్లని పెంచుతోంది. దానికి లూసీ అని పేరు పెట్టారు. కుటుంబంలో ఒకరిలా చూస్తు న్నారు. ప్రస్తుతం లూసీ గర్భిణి కావడంతో పళనివేల్ కుటుంబం లూసీకి సీమంతం షవర్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
లూసీని ప్రత్యేకంగా అలంకరించి పూలమాల వేసి కుర్చీలో కూర్చోబెట్టారు. బంగారు హారాన్ని ధరించి పసుపు, కుంకుమ పెట్టారు. అలాగే, లూసీకి ఇష్టమైన ఆహార పదార్థాలను దాని ముందు ఉంచి మంచి పిల్లలకు జన్మనివ్వాలని దేవుడిని ప్రార్థించారు.