Disturbing Video: ‘తీవ్రంగా ఖండిస్తున్నా.. కఠినశిక్ష విధిస్తాం’ | Animal Crulity: Shivraj Chouhan Reacts Assures Harshest Action | Sakshi
Sakshi News home page

Disturbing Video: ‘తీవ్రంగా ఖండిస్తున్నా.. కఠినశిక్ష విధిస్తాం’

Published Sun, Dec 10 2023 3:41 PM | Last Updated on Sun, Dec 10 2023 4:09 PM

Animal Crulity: Shivraj Chouhan Reacts Assures Harshest Action - Sakshi

భోపాల్‌:  మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలో చోటుచేసుకున్న ఓ అనాగరిక ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ స్పందించారు. ఆ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దారుణమైన ఘటన వివరాల్లోకి వెళ్లితే.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గుణా జిల్లాలో ఓ వ్యక్తి తన ఇంటి మందు కూర్చొని ఉండగా .. అతని వద్దకు రెండు చిన్న కుక్క పిల్లలు వచ్చాయి.

దీంతో అతను ఓ కుక్క పిల్లను పట్టుకొని విచక్షణరహితంగా నేలకు విసిరికొట్టాడు. అక్కడికి ఆగకుండా ఆ కుక్క పిల్లను కాలుతో నలిపేశాడు. ఈ దారుణ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన తన దృష్టికి రావటంతో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందిస్తూ.. ఈ అనాగరికమైన ఘటనకు పాల్పడిన వ్యక్తిపై జరిమానా విధించాలని సీఎం చౌహాన్‌ను ఎక్స్‌( ట్విటర్‌) ద్వారా కోరారు.

దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. ‘అనాగరిక ఘటన తీవ్రంగా కలిచివేసిది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. కచ్చితంగా బాధ్యులు పర్యవసానాలు ఎదుర్కొంటారు’అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.        ​
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement