భోపాల్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమా భారతి మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. ఆమెకు సంబంధించిన ఓ వీడియోలో హల్ చల్ చేస్తోంది. మధ్యప్రదేశ్‌లో మద్యం నిషేధించాలని అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ డిమాండ్ చేసింది. జనవరి 15వ తేదీ నాటికి రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని కోరింది. లేని పక్షంలో రోడ‍్ల మీదకు వచ్చి నిరసలకు దిగుతామని వార్నింగ్ ఇచ్చింది.
కాగా, ఇప్పటి వరకు మధ్యప్రదేశ్‌లో మద్యంపై నిషేధం విధించకపోవడంతో ఆమె రంగంలోకి దిగింది. అన్న మాట నిలుబెట్టుకుంది. భోపాల్‌లోని ఓ వైన్ షాపుపై రాళ్లతో ఆమె దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, మధ్యప‍్రదేశ్‌లో బీజేపీ ప‍్రభుత్వమే అధికారంలో ఉండటం గమనార్హం. బీజేపీ ప్రభుత్వంపైనే ఇలా నిరసనకు దిగి మరోసారి ఆమె ఫైర్ బ్రాండ్ అని నిరూపించుకున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Senior #BJP leader #UmaBharti in action at a #Liquor vend in #Bhopal, she has been batting for #LiquorBan in the state.
What is called LAW & ORDER? Is this the way to protest?#MadhyaPradesh pic.twitter.com/hvHLCjmtOr
— Safa 🇮🇳 (@safaperaje) March 13, 2022
అయితే, ఉమా భారతి ఏం చేసినా.. ఏం మాట్లాడినా అది సంచలనమే అవుతుంది. అంతకు ముందు భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చేదీ మేమే, వాళ్లకు జీతాలు ఇచ్చేది కూడా మేమే.. వాళ్ళు కేవలం మా చెప్పులు మోయడానికి పనికి వస్తారు. రాజకీయాలకు వారిని మేము వాడుకుంటామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.
Comments
Please login to add a commentAdd a comment