భోపాల్: బీజేపీకి ఓటేసినందుకు బావ వరుస అయ్యే వ్యక్తి తనపై దాడి చేశాడని ఓ ముస్లిం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెహోర్‌లోని అహ్మద్‌పూర్ ప్రాంతానికి చెందిన సమీనా బీ అనే మహిళ డిసెంబ్ 4న బీజేపీ విజయం సాధించినందుకు సంబరాలు చేసుకున్నారు. అయితే ఇదంతా గమనించిన జావేద్ ఖాన్ బీజేపీకి ఎందుకు ఓటు వేశావంటూ వేధించటం మొదలుపెట్టాడు.
దుర్భషలాడిన తన బావ జావేద్‌ను ఆమె ప్రశ్నించగా.. అతడు ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆపై బీజేపీ మద్దతుగా నిలిస్తే ఊరుకోనని ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఇచ్చిన ఫిర్యాదుతో సెహోర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. అయితే ఆమె జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీన్ సింగ్‌ను కూడా కలిసి తనపై దాడి చేసిన జావేద్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విషయం తెలిసిన సీఎం శీవరాజ్ సింగ్ చౌహాన్ ఆమెను తన అధికార నివాసానికి పిలిపించుకున్నారు. ఆమె తన పిల్లలతో సీఎం చౌహాన్ కలిసి.. తాను బీజేపీ ఓటు వేసినందుకు తన బావ జావేద్ దాడి చేసినట్లు తెలిపారు. జావేద్ నుంచి తమకు భద్రత కల్పించాలని ఆమె సీఎంను కోరారు. సీఎంను కలిసిన అనంతరం సమీనా బీ మీడియాతో మాట్లాడుతూ.. తనకు, తన పిల్లలకు భద్రత కల్పించాలని సీఎం కోరినట్లు తెలిపారు. దానికి సీఎం చౌహాన్ సానుకూలంగా స్పందిస్తూ.. తన పిల్లల పూర్తి భద్రతకు హామీ ఇచ్చారని తెలిపారు.
ఓటు ఎవరికి వేయాలనేది తన హక్కు అని చెప్పారు. రాజ్యాంగం ఆ హక్కును కల్పించిందని అన్నారు. సీఎం శివరాజ్‌సంగ్ చౌహాన్.. ఎప్పుడూ తప్పు చేయరని, అందుకు ఆయన పార్టీ అయిన బీజేపీకి ఓటు వేశానని తెలిపారు. కాగా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 163 స్థానాల్లో భారీ విజయం సాధిందించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కేవలం 66 సీట్లకు మాత్రమే పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment