భోపాల్: మధ్యప్రదేశ్‌లో భారీ విజయం సాధించిన బీజేపీ.. పలు రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాష్ట్ర సీఎంగా మోహన్ యాదవ్‌ను ఎంపీక చేసిన విషయం తెలిసిందే. మరోసారి సీఎం పదవి దక్కుతుందని ఆశించిన శివరాజ్ సింగ్ చౌహాన్‌కు నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో సీఎం పదవికి సంబంధించి శివరాజ్ సింగ్ చౌహాన్ పలు వేదికలపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. శుక్రవారం బీజేపీ నేత శివరాజ్ సింగ్ పూణెలోని ఎంఐటీ ప్రభుత్వ పాఠశాలలో ప్రసంగించారు.
తాను ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా పిలువబడుతున్నా, కానీ తిరస్కరణ సీఎం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధిక కాలం పని చేసిన నేతపై ప్రజలు కొంత అసహం వ్యక్తం చేస్తారని తెలిపారు. సుదీర్ఘ కాలం సీఎంగా పని చేసి.. ప్రస్తుతం పదవిలో లేకున్నా ప్రజలు తన పట్ల ప్రేమను చూపుతున్నారని తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు ‘మామా’ అని ప్రేమగా పిలుస్తున్నారని అన్నారు. ప్రజల ప్రేమే తనకు అసలైన ఆస్తి అని చెప్పారు.
ముఖ్యమంత్రి పదవిలో లేనంత మాత్రానా తాను క్రీయాశీలక రాజకీయాల్లో లేనట్టు కాదని తెలిపారు. పదవులకు ఆశపడి తాను రాజకీయాల్లో ఉండటం లేదని.. ప్రజలకు సేవ చేయటమే తనకు మొదటి ప్రాధాన్యం అని చెప్పారు. తాను అహంకారపూరితంగా మాట్లాడనని.. ఇప్పటివరకు 11 సార్లు ఎన్నికల్లో గెలిచానని తెలిపారు. కానీ తనకోసం ఎప్పుడూ ప్రచారం చేయలేదని అన్నారు. నిజాయితీగా ఎన్నికల్లో పోటీ చేస్తే.. ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపిస్తారని అన్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 230 సీట్లకు బీజేపీ 163 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఫలితాలు విడుదలైన అనంతరం కూడా శివరాజ్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర బీజేపీ నేతల వలే తాను పదవుల కోసం ఢిల్లీకి వెళ్లనని అన్నారు. తాను ఇప్పటి వరకు పదవుల కోసం ఢిల్లీకి వెళ్లలేదని చెప్పారు. పదువుల కోసం ఢిల్లీ వెళ్లటం కంటే ప్రజల కోసం మరణించడానికైనా తాను సిద్ధపడతానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment