భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నేత శివరాజ్‌సింగ్ చౌహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు పదవిని పొందడానికి వేచి చూస్తూ ఉంటాం..మళ్లీ వెంటనే పదవి చేపట్టడానికి తిరస్కరణకు గురవుతామని ఒకింత భావోద్వేగంతో అన్నారు. మంగళవారం తన సొంద నియోజకవర్గం బధ్నిలో నిర్వహించిన ఓ సభలో శివరాజ్ సింగ్ పాల్గొని మాట్లాడారు.
తాను ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటానని అన్నారు. ముఖ్యంగా తన సోదరీమణుల కోసం ఎప్పడూ అండగా ఉంటానని భావోద్వేగంతో అన్నారు. తాను ఎక్కడికీ వెళ్లనని. ఇక్కడే జీవిస్తూ.. ఇక్కడే చనిపోతానని శివరాజ్ అన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న మహిళలంతా ‘అన్నా’.. మమ్మల్ని విడిచి.. మీరు ఎక్కడికీ వెళొద్దని పెద్దగా అరుస్తూ కోరారు. కొత్త ప్రభుత్వం అన్ని పథకాలను ముందుకు తీసుకుపోతుందని తెలిపారు. అయితే కొన్ని పదవుల కోసం వేచి ఉంటామని.. తర్వత మళ్లీ వాటికి తిరస్కరించబడతామని తెలిపారు.
ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు సార్లు సీఎంగా పనిచేసిన శివరాజ్ మరోసారి బీజేపీ అధిస్టానం మరో అవకాశం ఇస్తుందని పార్టీలో చర్చ జరిగింది. అయితే ముందు నుంచి ఊహించినట్లుగానే బీజేపీ మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230 సీట్లకు బీజేపీ 163 స్థానాలు గెలుచుకొన్న విషయం తెలిసిందే.
చదవండి: Forex Violation Case: అశోక్ గహ్లోత్ కుమారుని ఆస్తులపై ఈడీ సోదాలు
Comments
Please login to add a commentAdd a comment