Ex CM
-
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కన్నుమూత
-
మాజీ సీఎం బుద్ధదేవ్ జీవితం సాగిందిలా..
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ నేటి(గురువారం) ఉదయం కలకత్తాలో కన్నుమూశారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు.బుద్ధదేవ్ భట్టాచార్య 1944, మార్చి 9న జన్మించారు. 2000లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన ఆయన 2011 వరకు సీఎంగా కొనసాగారు. జాదవ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. వరుసగా 24 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన తన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మనీష్ గుప్తా చేతిలో ఓడిపోయారు. సీనియర్ సీపీఐ(ఎం) నేత బుద్ధదేవ్ భట్టాచార్య జ్యోతిబసు క్యాబినెట్లో దాదాపు 18 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. హోం మంత్రిత్వ శాఖతో సహా అనేక ముఖ్యమైన మంత్రిత్వ శాఖలలో పనిచేశారు.1977లో తొలిసారిగా కోసిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1982 ఎన్నికల్లో భట్టాచార్య ఓడిపోయినా పార్టీలో ఆయన స్థాయి పెరిగింది. 1987లో జాదవ్‌పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. దీని తర్వాత అతను జాదవ్‌పూర్ నుండి ఎన్నికల్లో విజయపరంపర కొనసాగించారు.జ్యోతిబసు హయాంలో డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జ్యోతిబసు వారసునిగా నిలిచారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా బంగ్లా కొనేందుకు నిరాకరించారు. ఐదు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగి 18 ఏళ్లు మంత్రిగా, 11 ఏళ్లు సీఎంగా ఉన్నా ఆయనకు సొంత బంగ్లా, కారు లేదు. ఆయన తన జీతాన్ని కూడా పార్టీ ఫండ్‌కి అందజేసేవారు. బుద్ధదేవ్ భట్టాచార్య మంత్రిగా, సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన కుటుంబసభ్యులు ప్రజారవాణాలో మాత్రమే ప్రయాణించేవారు. -
‘లోక్‌సభ’ పోరులో ఆరుగురు మాజీ సీఎంలు.. ఎవరి ఆస్తి ఎంత?
రాబోయే లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి 400కు మించిన సీట్ల టార్గెట్‌తో రంగంలోకి దిగింది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు బీజేపీ తన అభ్యర్థుల ఎంపికలో ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించింది. ఈ క్రమంలోనే ఈసారి వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులను లోక్‌సభ ఎన్నికల బరిలో నిలబెట్టింది. ఇప్పుడు అందరి దృష్టి ఈ మాజీ సీఎంలపైనే నిలిచింది. హర్యానా నుంచి మనోహర్‌లాల్, కర్ణాటక నుంచి బసవరాజ్ బొమ్మై, ఉత్తరాఖండ్ నుంచి త్రివేంద్రసింగ్ రావత్, త్రిపుర నుంచి బిప్లబ్ దేబ్, మధ్యప్రదేశ్ నుంచి శివరాజ్‌సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డిలకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. వీరంతా మాజీ సీఎంలు. వారిలో ఎవరు అత్యంత ధనవంతులు ఎవరో తెలుసుకుందాం. 1. మనోహర్ లాల్ మనోహర్ లాల్ హర్యానా మాజీ ముఖ్యమంత్రి. మైనెటైన్ఫో తెలిపిన వివరాల ప్రకారం మనోహర్ లాల్ ఆస్తుల విలువ రూ.ఒక కోటి 27 లక్షలకు పైగా ఉంది. 2019లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన ఇచ్చిన అఫిడవిట్లో తన బ్యాంకు ఖాతాలో దాదాపు రూ.2.5 లక్షలు ఉన్నట్లు తెలిపారు. 2019లో తాను సుమారు రూ. 5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నట్లు కూడా పేర్కొన్నారు. స్థిరాస్తి విషయానికొస్తే రూ.50 లక్షలకు పైగా విలువైన వ్యవసాయ భూమి ఆయన పేరిట ఉంది. దాదాపు రూ.3 లక్షల విలువైన ఇల్లు కూడా ఉంది. 2. బసవరాజ్ బొమ్మై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన బసవరాజ్ బొమ్మై అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం ఆయనకు రూ. 42.15 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఇందులో హిందూ అవిభక్త కుటుంబానికి చెందిన రూ. 19.2 కోట్లు ఉన్నాయి. 2022 మార్చి 26న ముఖ్యమంత్రి పదవిలో ఉండగా ఆయన తరిహాల గ్రామంలో మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. 2023 నాటి ఈ అఫిడవిట్ ప్రకారం బొమ్మైతో పాటు అతనిపై ఆధారపడిన వారి మొత్తం ఆస్తుల విలువ రూ. 52.12 కోట్లు. 3. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌కు నాలుగుసార్లు సీఎం అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ 2023 అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్లో తన మొత్తం ఆస్తులు రూ. 3.21 కోట్లు కాగా, ఆయన భార్య సాధనా సింగ్ మొత్తం ఆస్తులు రూ. 5.41 కోట్లు. ఐదేళ్ల క్రితం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆస్తులు రూ.3.26 కోట్లు. శివరాజ్ చరాస్తులు రూ.1,11,20,282 కాగా, స్థిరాస్తులు రూ.2.10 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. అతని భార్య సాధనా సింగ్ చరాస్తులు రూ.1,09,14,644. సాధనా సింగ్ మొత్తం స్థిరాస్తులు రూ.4.32 కోట్లు. 4. కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి ఆస్తుల విలువ దాదాపు రూ.19 కోట్లు. ఆయనకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో దాదాపు రూ.9 కోట్ల విలువైన బంగ్లా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర మారుతి, మహీంద్రా స్కార్పియో, మహీంద్రా ఎక్స్‌యూవీ, ఫోక్స్‌వ్యాగన్ తదితర కార్లు ఉన్నాయి. 5. త్రివేంద్ర సింగ్ రావత్ ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఇటీవల సమర్పించిన అఫిడవిట్లో తన వద్ద రూ.56 వేలు, తన భార్య వద్ద రూ.32 వేల నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. అతని బ్యాంకు ఖాతాలో రూ.59 లక్షల 88 వేల 913, అతని భార్య బ్యాంకు ఖాతాలో రూ.94 లక్షల 80 వేల 261 ఉన్నట్లు పేర్కొన్నారు. త్రివేంద్ర సింగ్ రావత్ వద్ద 40 గ్రాముల బంగారం ఉంది. దీని విలువ దాదాపు రూ.2 లక్షల 47 వేల 200. అతని భార్య వద్ద 110 గ్రాముల బంగారం ఉంది. దీని విలువ సుమారు రూ.6 లక్షల 79 వేల 800. చరాస్తుల విషయానికి వస్తే త్రివేంద్ర సింగ్ రావత్‌కు రూ.62 లక్షల 92 వేల 113 విలువైన చరాస్తులు ఉన్నాయి. ఆయన భార్యకు రూ. ఒక కోటి 1లక్ష 92వేల 61 విలువైన చరాస్తులు ఉన్నాయి. త్రివేంద్ర సింగ్ రావత్‌కు వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర, పూర్వీకుల ఆస్తులు కలిపి దాదాపు రూ. 4 కోట్ల ఒక లక్షా, 99 వేల 805 విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన భార్యకు రూ. ఒక కోటీ 8లక్షల 68వేల 60 విలువైన స్థిరాస్తి ఉంది. త్రివేంద్ర సింగ్ బ్యాంకు నుంచి రూ.75 లక్షల రుణం తీసుకున్నారు. 6. బిప్లబ్ కుమార్ దేబ్ త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ ఇటీవల తన నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్లో తన వద్ద సుమారు రూ.52 వేల నగదు, తన భార్య వద్ద దాదాపు రూ.2400 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. బిప్లబ్ దేబ్‌కు చెందిన వివిధ బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.92 లక్షల 78 వేల 838 ఉండగా, అతని భార్య బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ. ఒక కోటి ఏడు లక్షల 47 వేలు జమ అయ్యాయి. బిప్లబ్ దేబ్ వద్ద సుమారు రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉండగా, ఆయన భార్య వద్ద దాదాపు రూ.9 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. బిప్లబ్ కుమార్ దేబ్ వద్ద నగలు, నగదు సహా రూ.95 లక్షల 78 వేల 838 విలువైన చరాస్తులు ఉన్నాయి. ఆయన భార్యకు రూ. ఒక కోటి 16లక్షల 4వేల 729 విలువైన చరాస్తులు ఉన్నాయి. బిప్లబ్ కుమార్ దేబ్ అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం అతనికి సుమారు రూ. ఒక కోటి 89 లక్షల 17 వేల 755 విలువైన స్థిరాస్తి (వ్యవసాయ, వ్యవసాయేతర భూమి) ఉంది. అతని భార్యకు దాదాపు రూ.61 లక్షల విలువైన స్థిరాస్తి (వ్యవసాయ, వ్యవసాయేతర భూమి) ఉంది. -
‘భారత రత్న’ అందుకున్న ప్రముఖులెవరు?
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజానేత కర్పూరి ఠాకూర్‌ను భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో గౌరవించింది. ఇప్పటివరకూ 49 మంది ప్రముఖులు ‘భారతరత్న’ను అందుకున్నారు. వీరిలో 17 మందికి మరణానంతరం భారతరత్న లభించింది. భారతరత్న పొందిన వారిలో క్రికెట్ గాడ్‌గా పేరొందిన సచిన్ టెండూల్కర్ పేరు కూడా ఉంది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు... ఇలా పలువురు ‘భారతరత్న’ అందుకున్నారు. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 26న అంటే గణతంత్ర దినోత్సవం రోజున దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందజేస్తుంది. ఈ జాబితాలో తాజాగా ప్రముఖ గాంధేయ సోషలిస్ట్ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ పేరు కూడా చేరింది. కర్పూరి ఠాకూర్ 1970, డిసెంబర్ నుండి 1971 జూన్ వరకు తిరిగి 1977 డిసెంబర్ నుండి 1979 ఏప్రిల్ వరకు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కర్పూరి ఠాకూర్ 1988 ఫిబ్రవరి 17న కన్నుమూశారు. భారతరత్నను ప్రదానం చేయడం 1954లో ప్రారంభమైంది. కులం, వృత్తి, హోదా, లింగ భేదం లేకుండా ఆయారంగాల్లో విశేష కృషి చేసినవారికి ఈ గౌరవం దక్కుతుంది. ఇప్పటివరకు ‘భారతరత్న’ అందుకున్నవారు 1. చక్రవర్తి రాజగోపాలాచారి (రాజకీయవేత్త, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు)- 1954 2. సర్వేపల్లి రాధాకృష్ణన్ (తత్వవేత్త, రాజకీయవేత్త, భారత మాజీ రాష్ట్రపతి)- 1954 3. చంద్రశేఖర్ వెంకట రామన్ (భౌతిక శాస్త్రవేత్త)- 1954 4. భగవాన్ దాస్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు, తత్వవేత్త, విద్యావేత్త)- 1955 5. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (సివిల్ ఇంజనీర్, రాజకీయవేత్త, మైసూర్ దివాన్)- 1955 6. జవహర్లాల్ నెహ్రూ (స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత, భారత మాజీ ప్రధాని)- 1955 7. గోవింద్ వల్లభ్ పంత్ (స్వాతంత్ర్య సమరయోధుడు)- 1957 8. ధోండో కేశవ్ కర్వే (సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుడు)- 1958 9. బిధాన్ చంద్ర రాయ్ (వైద్యుడు, రాజకీయ నేత , పరోపకారి, విద్యావేత్త, సామాజిక కార్యకర్త) - 1961 10. పురుషోత్తం దాస్ టాండన్ (స్వాతంత్ర్య సమర యోధుడు)- 1961 11. రాజేంద్ర ప్రసాద్ (స్వాతంత్ర్య సమర యోధుడు, న్యాయవాది, రాజకీయవేత్త, పండితుడు, భారత మాజీ రాష్ట్రపతి)- 1962 12. జాకీర్ హుస్సేన్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1963 13. పాండురంగ్ వామన్ కేన్ (ఇండాలజిస్ట్, సంస్కృత పండితుడు)-1963 14. లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) (స్వాతంత్ర్య సమర యోధుడు, భారత మాజీ ప్రధాని) – 1966 15. ఇందిరా గాంధీ (రాజకీయనేత, భారత మాజీ ప్రధానమంత్రి)-1971 16. వరాహగిరి వెంకట గిరి (స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ రాష్ట్రపతి)-1975 17. కుమారస్వామి కామరాజ్ (మరణానంతరం) (రాజకీయవేత్త, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి) - 1976 18. మదర్ మేరీ థెరిసా బోజాక్షియు (మదర్ థెరిసా) (మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు) - 1980 19. వినోబా భావే (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు, సంఘ సంస్కర్త)-1983 20. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు)-1987 21. మరుదూర్ గోపాలన్ రామచంద్రన్ (మరణానంతరం) (రాజకీయనేతగా మారిన నటుడు)-1988 22. భీమ్ రావ్ రామ్‌జీ అంబేద్కర్ (మరణానంతరం) (సంఘ సంస్కర్త)-1990 23. నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (వర్ణవివక్ష వ్యతిరేక పోరాట నేత)- 1990 24. రాజీవ్ గాంధీ (మరణానంతరం) (రాజకీయనేత, భారత మాజీ ప్రధాని)-1991 25. సర్దార్ వల్లభాయ్ పటేల్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1991 26. మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్ (స్వాతంత్ర్య పోరాట వీరుడు, భారత ప్రధాని)- 1991 27. మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు)-1992 28. జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా (పారిశ్రామికవేత్త)- 1992 29. సత్యజిత్ రే (చిత్ర నిర్మాత)- 1992 30. గుల్జారీ లాల్ నందా (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1997 31. అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) (స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు)- 1997 32. ఎ.పి.జె. అబ్దుల్ కలాం ( శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి)-1997 33. మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (కర్ణాటక శాస్త్రీయ గాయని)-1998 34. చిదంబరం సుబ్రమణ్యం (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1998 35. జయప్రకాష్ నారాయణ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు, సంఘ సంస్కర్త)- 1999 36. అమర్త్య సేన్ (ఆర్థికవేత్త)- 1999 37. ప్రకాష్ గోపీనాథ్ బోర్డోలోయ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు) – 1999 38. రవిశంకర్ (సితార్ వాద్యకారుడు) - 1999 39. లతా దీనానాథ్ మంగేష్కర్ (గాయని)- 2001 40. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ (హిందుస్తానీ క్లాసికల్ షెహనాయ్ ప్లేయర్)- 2001 41. భీంసేన్ గురురాజ్ జోషి (హిందుస్తానీ క్లాసికల్ సింగర్)- 2009 42. సిఎన్ఆర్ రావు (కెమిస్ట్, ప్రొఫెసర్)- 2014 43. సచిన్ రమేష్ టెండూల్కర్ (క్రికెటర్)- 2014 44. అటల్ బిహారీ వాజ్‌పేయి (రాజకీయ నేత, భారత మాజీ ప్రధాని)- 2015 45. మదన్ మోహన్ మాలవీయ (మరణానంతరం) (పండితులు, విద్యా సంస్కర్త)- 2015 46. నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం) (సామాజిక కార్యకర్త)- 2019 47. భూపేంద్ర కుమార్ హజారికా (మరణానంతరం) (ప్లేబాక్ సింగర్, గేయ రచయిత, సంగీతకారుడు, కవి, చలనచిత్ర నిర్మాత) - 2019 48. ప్రణబ్ ముఖర్జీ (రాజకీయనేత, భారత మాజీ రాష్ట్రపతి)- 2019 49. కర్పూరి ఠాకూర్ (మరణానంతరం) (రాజకీయనేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి) – 2024 -
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి తండ్రి కన్నుమూత
ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్ తండ్రి నందకుమార్ బఘెల్(89) కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన రాయ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నందకుమార్ బఘేల్‌కు ఇద్దరు కుమారులు. ఒక కుమార్తె. ప్రజల తుది దర్శనం కోసం ఆయన భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామం శాంతి నగర్‌లోని పటాన్ సదన్‌లో ఉంచారు. మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ విషయం తెలియగానే ఆయన ఢిల్లీ నుంచి రాయ్‌పూర్ చేరుకున్నారు. నందకుమార్ బఘెల్ అంత్యక్రియలు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారనే సమాచారం ఇంకా వెల్లడికాలేదు. -
మీతోనే ఉంటానంటూ శివరాజ్ సింగ్ భావోద్వేగం
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నేత శివరాజ్‌సింగ్ చౌహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు పదవిని పొందడానికి వేచి చూస్తూ ఉంటాం..మళ్లీ వెంటనే పదవి చేపట్టడానికి తిరస్కరణకు గురవుతామని ఒకింత భావోద్వేగంతో అన్నారు. మంగళవారం తన సొంద నియోజకవర్గం బధ్నిలో నిర్వహించిన ఓ సభలో శివరాజ్ సింగ్ పాల్గొని మాట్లాడారు. తాను ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటానని అన్నారు. ముఖ్యంగా తన సోదరీమణుల కోసం ఎప్పడూ అండగా ఉంటానని భావోద్వేగంతో అన్నారు. తాను ఎక్కడికీ వెళ్లనని. ఇక్కడే జీవిస్తూ.. ఇక్కడే చనిపోతానని శివరాజ్ అన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న మహిళలంతా ‘అన్నా’.. మమ్మల్ని విడిచి.. మీరు ఎక్కడికీ వెళొద్దని పెద్దగా అరుస్తూ కోరారు. కొత్త ప్రభుత్వం అన్ని పథకాలను ముందుకు తీసుకుపోతుందని తెలిపారు. అయితే కొన్ని పదవుల కోసం వేచి ఉంటామని.. తర్వత మళ్లీ వాటికి తిరస్కరించబడతామని తెలిపారు. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు సార్లు సీఎంగా పనిచేసిన శివరాజ్ మరోసారి బీజేపీ అధిస్టానం మరో అవకాశం ఇస్తుందని పార్టీలో చర్చ జరిగింది. అయితే ముందు నుంచి ఊహించినట్లుగానే బీజేపీ మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230 సీట్లకు బీజేపీ 163 స్థానాలు గెలుచుకొన్న విషయం తెలిసిందే. చదవండి: Forex Violation Case: అశోక్ గహ్లోత్ కుమారుని ఆస్తులపై ఈడీ సోదాలు -
ఆ మాజీ సీఎంల పని ఏమిటి? జేపీ నడ్డా ఏమన్నారు?
భారతీయ జనతాపార్టీ(బీజేపీ) కొత్తగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో నాయకత్వాన్ని మార్చి, నూతన నేతలకు బీజేపీ అధికారాన్ని అప్పగించింది. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం నేపధ్యంలో పార్టీలోని సీనియర్ నేతలు వసుంధర రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్‌ల భవిష్యత్ ఏమిటనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. దీనికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ మీడియా కార్యక్రమంలో సమాధానమిచ్చారు. ఈ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు బీజేపీ సీనియర్ నేతలని, వారి స్థాయికి అనుగుణంగా భవిష్యత్తులో పార్టీ వారికి తగిన హోదా కల్పిస్తుందని అన్నారు. తమ పార్టీలో ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందని, ప్రతిచిన్న కార్యకర్తకు కూడా పార్టీ తగిన స్థానం ఇస్తుందని అన్నారు. దీనిపై పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందని, ఆ సీనియర్లకు మరో పనిని అప్పగిస్తామన్నారు. వారి సేవలను పార్టీ సద్వినియోగం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రశ్నకు సమాధానం కొన్ని పదాలలో వివరించడం కష్టమని, ఇటువంటి పరిస్థితుల్లో.. ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు అని మాత్రమే కాకుండా ప్రతి కార్యకర్త గురించి కూడా పార్టీ ఆలోచిస్తుందని నడ్డా తెలిపారు. వారు చేపట్టిన కార్యక్రమాలు, వారి చరిత్రకు సంబంధించిన డేటా బ్యాంక్ తమ వద్ద ఉందని, వాటిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటామన్నారు. ఎన్నికలు ప్రకటించగానే మన నాయకుడెవరు? ప్రతిపక్షంలో కూర్చోగల తగిన నాయకుడు ఎవరు? అనే అంశంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని, ఈ ఎంపిక చాలా జాగ్రత్తగా జరుగుతుందని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: మాస్క్ మళ్లొచ్చింది.. సింగపూర్‌లో షురూ! -
హిమాలయాలు క్యాన్సిల్.. ప్రచారం షురూ: ఉమాభారతి యూటర్న్!
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి తన హిమాలయాల పర్యటనను రద్దు చేసుకుని, రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. నవంబర్ 9 నుంచి ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆమె సిల్వానీలోని బమ్‌హోరీ, సాగర్‌లోని సుర్ఖీలో ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. అయితే దీనికి ముందు ఉమాభారతి ఎన్నికల ప్రచారాన్ని నిరాకరించి, తాను హిమాలయాలకు వెళుతున్నట్లు ప్రకటించారు. దీంతో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఆమె పేరు నమోదు కాలేదు. అయితే ఆ తరువాత ఆమె మనసు మార్చుకుని, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అభ్యర్థన మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. కొద్దిరోజుల క్రితం ఉమాభారతి లలిత్పూర్ రైల్వే స్టేషన్లో స్వల్పంగా గాయపడ్డారు. ఆమె ఎడమ కాలికి గాయం అయ్యింది. తరువాత ఆమె ఝాన్సీలో ఫిజియోథెరపీ చేయించుకున్నారు. తరువాత వైద్యుల సూచన మేరకు భోపాల్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా ఆమె వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. తాను 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదని, రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నానని ఇటీవల స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: దీపోత్సవానికి అయోధ్య ముస్తాబు -
కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ కన్నుమూత
-
సిద్ధరామయ్య మా దేవుడు అంటున్న వరుణ ప్రజలు
-
కర్ణాటకలో మళ్లీ బీజేపీదే విజయం: యడియూరప్ప
-
పంజాబ్ ప్రజలు మార్పు కోరుకున్నారు: చరణ్‌జిత్ సింగ్ చన్నీ
-
ఒడిశా మాజీ సీఎం హేమానంద బిశ్వాల్ కన్నుమూత
సాక్షి, భువనేశ్వర్: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్(82) ఇకలేరు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూసినట్లు ఆయన కుమార్తె సునీత తెలిపారు. ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా అఖిల పక్ష నాయకులు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్రంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా పేరొందిన హేమానంద రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తొలుత 1989 డిసెంబర్ 7వ తేదీ నుంచి 1990 మార్చి 5వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. రెండోసారి 1999 డిసెంబర్ 6వ తేదీ నుంచి 2000 మార్చి 5వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా ఈయన బాధ్యతలు చేపట్టారు. ఝార్సుగుడ జిల్లాలోని ఠకురొపొడా గ్రామంలో 1939 డిసెంబర్ 1వ తేదీన జన్మించిన ఈయన 1970 దశకంలో పంచాయతీ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఝార్సుగుడ జిల్లా, కిరిమిరా పంచాయతీ సమితి అధ్యక్షునిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1974లో ఝార్సుగుడ జిల్లా, లయికెరా నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 2009లో సుందరగఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1974 నుంచి 1977వ సంవత్సరం, 1980 నుంచి 2004వ సంవత్సరాల మధ్య 6 సార్లు రాష్ట్ర శాసనసభకు ఈయన ఎన్నికయ్యారు. 1985 నుంచి 1986వ సంవత్సరం వరకు రాష్ట్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా ఈయన పనిచేయడం విశేషం. చదవండి: హిజాబ్‌పై తీర్పును రిజర్వ్ చేసిన కర్ణాటక హైకోర్టు -
మాజీ సీఎంకు కరోనా, ఆస్పత్రికి తరలింపు
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివాజీరావు పాటిల్ నీలంగేకర్(88)కు కరోనా సోకినట్లు తేలింది. దీంతో గురువారం ఆయనను లాతూర్ జిల్లా నుంచి పుణెలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 1985-86 మధ్య శివాజీరావు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాగా ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 2,75,640 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,50,001 కేసులతో తమిళనాడు రెండో స్థానంలో ఉండగా, 1,16,993 కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 32,695 పాజిటివ్ కేసులు బయటపడగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9,70169కు చేరుకుంది. (కరోనాను జయించి..101వ వసంతంలోకి) -
‘మాజీ సీఎంల విడుదల కోరుతూ తీర్మానం’
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయ నిర్బంధంలో మగ్గుతున్న ముగ్గురు జమ్ము కశ్మీర్ మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఎనిమిది విపక్ష పార్టీలు సంయుక్త తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపాయి. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో గత ఏడాది ఆగస్ట్ నుంచి ముగ్గురు మాజీ సీఎంలతో పాటు పలువురు రాజకీయ నేతలను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోదీ పాలనలో ప్రజాస్వామ్యయుతంగా వెలిబుచ్చే నిరసనలపై ఉక్కుపాదం మోపుతున్నారని, రాజ్యాంగ హక్కులైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వ హక్కులను కాలరాస్తున్నారని తీర్మానం ఆందోళన వ్యక్తం చేసింది. జమ్ము కశ్మీర్లో గృహనిర్బంధంలో మగ్గుతున్న ముగ్గురు మాజీ సీఎంలతో పాటు ఇతర రాజకీయ నేతలందరినీ తక్షణమే విడుదల చేయాలని తీర్మానం కోరింది. చదవండి : ఒమర్ నిర్బంధంపై సుప్రీం నోటీసులు -
విషాదం : మాజీ సీఎం కుమారుడి అనుమానాస్పద మృతి
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ కుమారుడు షుబన్సో అనూహ్య రీతిలో మరణించారు. కెనడా విశ్వవిద్యాలయంలో చదువుతున్న షుబన్సో ఫుల్ (20) అనుమానాస్పద పరిస్థితులలో చనిపోయినట్లు కుటుంబ వర్గాలు మంగళవారం తెలిపాయి. దీంతో 2016లో ఆత్మహత్యకు పాల్పడిన కలిఖో ఫుల్ ఇంట్లో తీరని విషాద ఛాయలు అలుముకున్నాయి. కలిఖో మొదటి భార్య డాంగ్విమ్సాయ్ కుమారుడైన షుబాన్సో సస్సెక్స్‌లోని బ్రైటన్‌లోని తన అపార్ట్మెంట్లో శవమై కనిపించడం కుటుంబ వర్గాలను కలవరపర్చింది. అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు యూకేలోని భారత హైకమిషన్‌తో సంప్రదిస్తున్నామని తెలిపారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డావంటూ 2015 ఏప్రిల్‌లో షో కాజ్ నోటీసు కూడా యివ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఫుల్‌ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించడంతో 19 ఫిబ్రవరి 2016న 30మంది రెబెల్ ఎమ్మెల్యేలు, బీజేపీ మద్దతుతో కలిసి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అయితే, ఈ నియామకానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆవేదనకు లోనైన ఫుల్ ఆగస్టు 9, 2016 న నీతి విహార్‌లోని తన అధికారిక నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఒక విషాదం. ఈ సందర్భంగా రాష్ట్రంలోచోటుచేసుకున్న భారీ అవినీతిపై ''మేరే విచార్'' (నా ఆలోచనలు) పేరుతో అనే 60 పేజీల సూసైడ్ నోట్ రాశారు. ఈ నోట్లో పేర్కొన్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు కోరుతూ మొదటి భార్య డాంగ్విమ్సాయ్ పుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తరపున ఆయన మూడవ భార్య దాసాంగ్లు విజయం సాధించారు. -
ఈశాన్య భారతంలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ
-
అంజయ్య సతీమణి మణెమ్మ కన్నుమూత
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య సతీమణి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే టి.మణెమ్మ (75) ఆది వారం కన్నుమూశారు. ఆమెకు నలుగురు కుమార్తె లు, ఒక కుమారుడు ఉన్నారు. రక్తహీనత, జ్వరంతోపాటు మరికొన్ని అనారోగ్య సమస్యలతో ఆమె గత నెల 27న జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్స నిర్వహిస్తున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించి ఆదివారం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గత మూడేళ్లుగా వయోభారం, అనారోగ్యంతో మణెమ్మ ఇంటికే పరి మితమయ్యారు. ఆమె అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో జరుగుతాయని బంధువులు తెలిపారు. రాజకీయ ప్రస్థానం.. 1986లో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న భర్త టి.అంజయ్య మృతి చెందడంతో ఆ పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మణెమ్మ విజయం సాధించారు.1989లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రెండవ సారి ఎంపీగా తెలంగాణలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి ముషీరాబాద్ అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికల్లో మణెమ్మను నిలబెట్టి గెలిపించారు. అనంతరం 2009లో మళ్లీ ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీఎం కేసీఆర్ సంతాపం.. మణెమ్మ మృతి పట్ల ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికార లాంఛనాలతో మణెమ్మ అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కేసీఆర్ ఆదేశించారు. కాంగ్రెస్‌కు తీరని లోటు: ఉత్తమ్ మణెమ్మ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మణెమ్మ మృతి పట్ల సంతా పం ప్రకటించారు. మణెమ్మ మృతి పట్ల టీపీసీసీ కిసాన్‌సెల్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి కూడా సంతాపం ప్రకటించారు. హోంమంత్రి నాయిని, కెవీపీ రాంచందర్‌రావు, జానారెడ్డి, పొన్నాల, పి.శంకర్ రావు, మాజీ ఎంపీ కెఎస్.రావు, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి దంపతులు మణెమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌లు ఫోన్లో కుటుంబసభ్యులను పరామర్శించారు. వైఎస్ జగన్ సంతాపం.. సాక్షి, అమరావతి: మణెమ్మ మృతిపట్ల ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు వైఎస్ జగన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
అధికారిక బంగ్లాలకు అఖిలేష్, ములాయం బై..
సాక్షి, లక్నో : సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా యూపీ మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ తమ అధికారిక బంగ్లాలను గురువారం ఖాళీ చేశారు. తొలుత వీరిద్దరూ బంగ్లాలను ఖాళీ చేసేందుకు తమకు రెండేళ్ల సమయం కావాలిన కోరిన సంగతి తెలిసిందే. యూపీ మాజీ సీఎంలు అందరూ అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎన్జీవో లోక్‌ప్రహరి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్ధానం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైన అఖిలేష్ తాను ఉండేందుకు మరో ఇల్లు లేదని అశక్తత వ్యక్తం చేశారు. మరోవైపు భారీ సెక్యూరిటీ, తన కోసం వచ్చే అతిధులకు సరిపోయే ఇల్లు తనకు లేదంటూ ములాయం సింగ్ యాదవ్ అధికారిక బంగ్లాలను ఖాళీ చేసేందుకు నిరాకరించారు. అయితే వీరి వాదనలను యూపీ అధికార యంత్రాంగం ఖాతరుచేయకపోవడంతో గురువారం ఇరువురు నేతలూ ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేశారు. ఇక మాజీ సీఎంలు మాయావతి, రాజ్‌నాథ్ సింగ్, కళ్యాణ్ సింగ్, ఎన్డీ తివారీలు తమకు కేటాయించిన అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాల్సి ఉంది. -
‘మాజీ సీఎంలకు అధికారిక బంగ్లాలు వద్దు’
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్‌లో మాజీ సీఎంలు ఎవరికీ ప్రభుత్వ బంగ్లాలు కేటాయించరాదని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. పదవీకాలం ముగిసిన సీఎంలకూ అధికారిక బంగ్లాలను కేటాయిస్తూ గతంలో యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. ఎన్జీఓ లోక్‌ప్రహరి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తూ సుప్రీం కోర్టు ఈ నిర్ణయం వెల్లడించింది. సీఎంగా తమ పదవీకాలం ముగిసిన వారికీ అధికారిక బంగ్లాలను కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. మాజీ సీఎంలకూ ప్రభుత్వ వసతిని కొనసాగిస్తూ యూపీ ప్రభుత్వం చేపట్టిన సవరణను సుప్రీం కోర్టు కొట్టివేసింది. యూపీ సర్కార్ తీసుకువచ్చిన చట్ట సవరణ వివక్షతో కూడినదని, రాజ్యాంగం నిర్ధేశించిన సమానత్వ సూత్రానికి విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం యూపీలో మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, మాయావతి, రాజ్‌నాథ్ సింగ్, కళ్యాణ్ సింగ్, ఎన్డీ తివారీలు ప్రభుత్వ బంగ్లాలను తమ స్వాధీనంలో ఉంచుకున్నారు. -
ఘనంగా ప్రకాశం పంతులు జయంతి
విజయవాడ సెంట్రల్ : ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంతి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 145వ జయంతి కార్యక్రమాన్ని మంగళవారం ఆంధ్రరత్నభవన్లో ఘనంగా నిర్వహించారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మద్రాసు నగరంలో సైమన్ కమిషన్‌ను ఎదిరించి పోరాడిన ప్రకాశం పంతులు జాతీయ ఉద్యమంలో తనదైన ముద్ర వేశారన్నారు. 1953లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన రాష్ట్రాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. తిరుపతిలో వెంకటేశ్వర విద్యాలయాన్ని స్థాపించి విద్యావేత్త అన్నారు. సిటీ కాంగ్రెస్ నాయకులు ఆర్.అప్పలస్వామి, సి.దుర్గారావు, కె.రామకృష్ణ, డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తండ్రి కోసం తనయుడు యాగం
తండ్రి కోసం తనయుడి యాగం ఆయన బలి అవుతున్నారా..? రామకృష్ణన్ అనుమానం వివరణకు కరుణ డిమాండ్ చెన్నై : ఎవరో చేసిన తప్పుకు మరెవరో బలి అవుతున్న చందంగా మంత్రి ఓ పన్నీరు సెల్వం పరిస్థితి మారుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయన్ను నిర్బంధంలో ఉంచినట్టుగా పుకార్లు బయలు దేరాయి. ఇక, తండ్రి కోసం అన్నట్టు శతృవినాస యాగాన్ని ఓపీఎస్ తనయుడు రవిచంద్రన్ నిర్వహించడం గమనార్హం. ఇక, తన నిజాయితీని నిరూపించుకునేందుకు జయలలిత కొత్త నాటకాన్ని రచించి ఉన్నారని సీపీఎం నేత రామకృష్ణన్ విమర్శించారు. మంత్రులపై బయలు దేరిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డీఎంకే అధినేత ఎం కరుణానిధి డిమాండ్ చేశారు. అన్నాడిఎంకేలో జయలలిత తదుపరి స్థానంలో ఉన్న మంత్రి, పార్టీ కోశాధికారి ఓ పన్నీరు సెల్వం ప్రస్తుతం సంకట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఇందుకు ఎన్నికల్లో వంద సీట్ల వరకు తన మద్దతు దారులకు ఇప్పించుకుని, తదుపరి తన బలాన్ని చాటుకునే వ్యూహంతో ఉన్నట్టు ఆయనపై బయలు దేరిన ఆరోపణలు కారణంగా పరిగణించ వచ్చు. అదే సమయంలో రోజుకో రూపంలో పన్నీరుకు వ్యతిరేకంగా, నత్తం విశ్వనాథన్ తదితర మంత్రులకు వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలతో అన్నాడీఎంకేలో ఏమి జరుగుతున్నదో అన్న ఉత్కంఠ బయలు దేరి ఉన్నది. తిరునల్వేలిలో అజ్ఞాతంలో ఉన్న పన్నీరు మద్దతు దారుడు ఓఎస్ మురుగన్ బండారాలు సైతం వెలుగులోకి రావడంతో ఓ పీఎస్‌కు కష్టాలు చుట్టుముట్టినట్టే. వంద కోట్ల మేరకు పూడిక తీత పనుల్లో అవినీతి జరిగినట్టు, ఇందుకు ఓఎస్ మురుగన్సూత్రదారుడిగా ఆరోపణలు వస్తున్నా, మంత్రులపై రోజుకో కథనం వెలువడుతున్నా, అన్నాడీఎంకేలో ఎలాంటి స్పందన లేదని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో మళ్లీ అధికారం లక్ష్యంగా వ్యూహ రచనలో ఉన్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత , తాజాగా మంత్రుల భరతం పట్టే విధంగా వ్యవహరిస్తుండటం చర్చకు తెర లేపి ఉన్నది. అలాగే, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వంను నిర్బంధంలో ఉంచినట్టుగా ప్రచారం , పుకార్లు బయలు దేరి ఉండటం గమనార్హం. అలాగే, అన్నాడీఎంకేను చీల్చి ఎంజీయార్ అన్నాడీఎంకే ఏర్పాటు కసరత్తుల్లో ఉండబట్టే ఆయన్ను నిర్బంధంలో ఉంచినట్టుగా పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. ఈ పుకార్ల నేపథ్యంలో పన్నీరు సెల్వం పోయెస్ గార్డెన్ మెట్లు ఎక్కనున్నట్టుగా ప్రచారం కూడా సాగినా, ఎంతకూ ఆయన రాలేదు. రెండు రోజుల క్రితం మాత్రం కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి పళనియమ్మాల్ను పరామర్శించి ఆగమేఘాలపై విమానంలో చెన్నైకు వచ్చినట్టు తదుపరి ఆయన ఇంటి కి లేదా, నగరంలోని ఓ హోటల్‌కు పరిమితమైనట్టుగా మద్దతు దారులు వ్యాఖ్యానిస్తుండడం గమనించాల్సిన విషయమే. తాజాగా, మంత్రులకు వ్యతిరేకంగా వెలువడుతున్న కథనాలను సైతం తమకు అనుకూల అస్త్రంగా మలచుకునేందుకు ప్రతి పక్షాలు సిద్ధమైనట్టున్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా సీఎం జయలలిత కొత్త నాటకాన్ని రచించినట్టుందని సీపీఎం నేత రామకృష్ణన్ వ్యాఖ్యానించారు. తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఓపీఎస్‌ను బలి చేయడానికి సిద్ధమైనట్టుందని ఆరోపించారు. ఇక, డిఎంకే అధినేత ఎం కరునానిధి పేర్కొంటూ, మంత్రులపై ఇస్తున్న కథనాలు, ఆరోపణలకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, శతృవినాసం కాంక్షిస్తూ ఓపీఎస్ తనయుడు రవిచంద్రన్ శ్రీవిల్లి పుత్తూరు సమీపంలోని ఓ గ్రామంలో యాగం చేయడం కొసమెరుపు.