
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివాజీరావు పాటిల్ నీలంగేకర్(88)కు కరోనా సోకినట్లు తేలింది. దీంతో గురువారం ఆయనను లాతూర్ జిల్లా నుంచి పుణెలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 1985-86 మధ్య శివాజీరావు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాగా ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 2,75,640 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,50,001 కేసులతో తమిళనాడు రెండో స్థానంలో ఉండగా, 1,16,993 కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 32,695 పాజిటివ్ కేసులు బయటపడగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9,70169కు చేరుకుంది. (కరోనాను జయించి..101వ వసంతంలోకి)