
ముంబై : కరోనా మహమ్మారిపై యుద్దంలో ముందువరుసలో ఉండిపోరాడుతున్న వైద్యసిబ్బంది కొన్ని చోట్ల వైరస్ బారినపడుతున్నారు. పుణేలోని రూబీ హాల్ క్లినిక్‌లో విధులు నిర్వర్తిస్తున్న 25 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో 19 మంది నర్సులు కూడా ఉన్నారని రూబీ హాల్ క్లినిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి బోబి బోటే పేర్కొన్నారు. దాదాపు వేయి మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా, 25 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందని బోబి బోటే తెలిపారు. వీరందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. కాగా మహారాష్ట్రా వ్యాప్తంగా ఇప్పటి వరకు 4203 కరోనా కేసులు నమోదవ్వగా, 223 మంది మృతిచెందారు. ఇక పుణేలో 87 కొత్త కరోనా కేసులతో కలుపుకుని మొత్తం 756 మంది కరోనా బారిన పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment