ఘనంగా ప్రకాశం పంతులు జయంతి
విజయవాడ సెంట్రల్ :
ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంతి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 145వ జయంతి కార్యక్రమాన్ని మంగళవారం ఆంధ్రరత్నభవన్లో ఘనంగా నిర్వహించారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మద్రాసు నగరంలో సైమన్ కమిషన్‌ను ఎదిరించి పోరాడిన ప్రకాశం పంతులు జాతీయ ఉద్యమంలో తనదైన ముద్ర వేశారన్నారు. 1953లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన రాష్ట్రాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. తిరుపతిలో వెంకటేశ్వర విద్యాలయాన్ని స్థాపించి విద్యావేత్త అన్నారు. సిటీ కాంగ్రెస్ నాయకులు ఆర్.అప్పలస్వామి, సి.దుర్గారావు, కె.రామకృష్ణ, డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.