
సాక్షి,భీమవరం (పశ్చిమగోదావరి): భీమవరం అంటేనే మర్యాదలకు, పసందైన విందులకు పేరు.. గతంలో ఓ కోడలు అత్తగారి పుట్టిన రోజున 60 రకాల వంటకాలు చేసి వారెవ్వా అనిపిస్తే.. శనివారం ఓ కోడలికి మామగారు 150 రకాల ఐటమ్స్‌తో విందు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో క్లిప్పింగ్‌లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
వివరాలు.. భీమవరానికి చెందిన తుంపూడి వెంకటకృష్ణ గుప్తా తన కోడలు తేజస్విని పుట్టినరోజున పసందైన వంటకాలు చేయించారు. వీటిలో 14 రకాల రైస్ ఐటమ్స్, 35 రకాల స్వీట్లు, 35 రకాల హాట్లు, 20 రకాల చాక్లెట్లు, 20 రకాల కేకులు, 11 రకాల బజ్జీలు, 15 రకాల పళ్లు, ఇలా 150 రకాల ఐటమ్స్ ఉన్నాయి. కాగా, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment