అధికారిక బంగ్లాలను ఖాళీ చేసిన యూపీ మాజీ సీఎంలు ములాయం, అఖిలేష్ యాదవ్
సాక్షి, లక్నో : సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా యూపీ మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ తమ అధికారిక బంగ్లాలను గురువారం ఖాళీ చేశారు. తొలుత వీరిద్దరూ బంగ్లాలను ఖాళీ చేసేందుకు తమకు రెండేళ్ల సమయం కావాలిన కోరిన సంగతి తెలిసిందే. యూపీ మాజీ సీఎంలు అందరూ అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఎన్‌జీవో లోక్‌ప్రహరి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్ధానం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైన అఖిలేష్ తాను ఉండేందుకు మరో ఇల్లు లేదని అశక్తత వ్యక్తం చేశారు. మరోవైపు భారీ సెక్యూరిటీ, తన కోసం వచ్చే అతిధులకు సరిపోయే ఇల్లు తనకు లేదంటూ ములాయం సింగ్ యాదవ్ అధికారిక బంగ్లాలను ఖాళీ చేసేందుకు నిరాకరించారు.
అయితే వీరి వాదనలను యూపీ అధికార యంత్రాంగం ఖాతరుచేయకపోవడంతో గురువారం ఇరువురు నేతలూ ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేశారు. ఇక మాజీ సీఎంలు మాయావతి, రాజ్‌నాథ్ సింగ్, కళ్యాణ్ సింగ్, ఎన్‌డీ తివారీలు తమకు కేటాయించిన అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment