vecate
-
రాజ్‌భవన్ ఆవరణను తక్షణమే ఖాళీ చేయండి
కోల్‌కతా: రాజ్‌భవన్ వద్ద బందోబస్తు విధుల్లో ఉండే కోల్‌కతా పోలీసు సిబ్బంది తక్షణమే అక్కడి నుంచి ఖాళీ చేయాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ సోమవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. రాజ్‌భవన్ నార్త్‌గేట్ వద్ద ఉన్న పోలీస్ ఔట్ పోస్టును ప్రజావేదికగా మార్చాలని గవర్నర్ భావిస్తున్నట్లు సమాచారం. గవర్నర్, మమతా బెనర్జీ మధ్య విభేదాలు కొనసాగుతున్న సమయంలోనే ఇటీవల చోటుచేసుకున్న ఒక పరిణామమే దీనికి కారణమని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వచి్చన సువేందు అధికారి సారథ్యంలోని బీజేపీ నేతల బృందాన్ని రాజ్‌భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయంటూ బీజేపీ నేతలను వెనక్కి పంపించి వేశారు. గవర్నర్ రాతపూర్వకంగా అనుమతి ఇచి్చనప్పటికీ పోలీసులు ఇలా వ్యవహరించడం వివాదస్పదమైంది. దీనిపై సువేందు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించడం.. గవర్నర్‌ను గృహ నిర్బంధంలో ఉంచారా అంటూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. -
నిత్యానంద ఆశ్రమం ఖాళీ, బిగుస్తున్న ఉచ్చు
అహ్మదాబాద్: వివాదాస్పద మత బోధకుడు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆశ్రమంలో బాలికలపై అత్యాచారం, కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో నిత్యానంద ఆశ్రమంలో పోలీసులు మరోసారి దాడులు నిర్వించారు. పలు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని నిత్యానంద ఆశ్రమాన్ని జిల్లా అధికారులు ఖాళీ చేయించారు. తన కుమార్తెలను అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. బాలికల అపహరణ, కిడ్నాప్లాంటి ఇతర క్రిమినల్ అభియోగా నేపథ్యంలో స్థానిక పోలీసులు తాజా దాడులు నిర్వహించారు. ల్యాప్‌టాప్, మొబైల్స్, ట్యాబ్స్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆశ్రమంలోని భక్తులంతా ఆశ్రమాన్ని వీడారు. అంతేకాదు స్వాధీనం చేసుకున్న డివైస్‌లలో మైనర్ పిల్లలపై శారీరక దాడి, వేధింపులు, తీవ్రంగా హింసిస్తున్న వీడియోలు, ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిత్యానంద తన కుమార్తెలను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన జనార్ధన శర్మ గత నెలలో గుజరాత్ రాష్ట్ర పిల్లల రక్షణ పరిరక్షణ కమిషన్‌తో పాటు గుజరాత్ హైకోర్టును ఆశయించారు. పిల్లల్ని తీవ్రంగా హింసించారని ఆరోపించారు. అయితే పోలీసుల చొరవతో ఇద్దరు కుమార్తెలకు విముక్తి లభించగా, పెద్ద కుమార్తెలిద్దరు నిత్యానంద సంస్థను విడిచి పెట్టడానికి నిరాకరించారు. తన పిల్లలను ఆశ్రమంలో బ్రెయిన్ వాష్ చేసి హింసించారని శర్మ ఆరోపించారు. అయితే వీరిని గుర్తించాల్సిందిగా గుజరాత్ హైకోర్టు నవంబర్ 26న పోలీసులను ఆదేశించింది. అంతేకాదు ఇంటర్‌పోల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధిత అధికారులను కూడా సంప్రదించాలని హైకోర్టు పోలీసులకు సూచించింది. దీంతో కేసు నమోదు చేసిన గుజరాత్ పోలీసులు పరారీలో ఉన్న నిత్యానందకోసం గాలిస్తున్నారు. మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఇ) అహ్మదాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు ఇచ్చిన అనుమతిని రద్దు చేసిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. నకిలీ ఎన్ఓసి (నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్) నిత్యానంద ఆశ్రమాన్ని నడుపుతున్నట్టు నిర్ధారించిన తరువాత అహ్మదాబాద్, హిరాపూర్, దాస్క్రోయిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు మంజూరు చేసిన సీనియర్ సెకండరీ స్థాయి వరకు తాత్కాలిక/సాధారణ ఎఫిలియేషన్‌ను తక్షణమే ఉపసంహరించుకుందని సీబీఎస్ఇ నోట్‌ను ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది. అయితే 2020 లో 10, 12 తరగతుల విద్యార్థులను బోర్డు పరీక్షకు హాజరుకావడానికి, తొమ్మిదవ తరగతి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను సమీపంలోని సీబీఎస్ఐ-అనుబంధ పాఠశాలలకు మార్చడానికి బోర్డు అనుమతించింది. కాగా అయితే అత్యాచారం కేసులో విచారణను తప్పించుకునేందుకు నిత్యానంద విదేశాలకు పారిపోయినట్టుగా భావిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నిత్యానంద పాస్‌పోర్ట్ గడువు 2018 సెప్టెంబర్‌లో ముగిసిందనీ, అత్యాచారం ఆరోపణల కారణంగా రెన్యువల్ చేయలేదనీ ప్రస్తుతం నిత్యానంద ఎక్కడ ఉన్నారో తెలియదని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
రూ.50 కోట్లతో ఎన్సీఎల్ వెకా ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూపీవీసీ ఉత్పత్తుల తయారీ సంస్థ ఎన్సీఎల్ వెకా హైదరాబాద్ శివారులో ప్లాంట్‌ను ప్రారంభించింది. మెదక్ జిల్లా ముచ్చెర్లలోని ఈ ప్లాంట్‌ను బుధవారం తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ప్రారంభించారు. 16.8 ఎకరాల్లో రూ.50 కోట్ల పెట్టుబడులతో ఈ ప్లాంట్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో 18 ఎక్స్‌ట్రూడర్ లైన్స్ ఉన్నాయని.. డిమాండ్‌ను బట్టి భవిష్యత్తులో వీటి సంఖ్యను 30కి పెంచుతామని ఎన్సీఎల్ వెకా సీఈఓ అశ్విన్ దాట్ల తెలిపారు. రూ.200 కోట్ల టర్నోవర్.. కొత్తగా ప్రారంభించిన ఈ ప్లాంట్ ద్వారా 450 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని ఈ సందర్భంగా అశ్విన్ తెలిపారు. 1.20 లక్షల చదరపు అడుగుల్లోని ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 24 వేల టన్నుల ప్రొఫైల్స్. ఈ ఉత్పత్తులను మన దేశంతో పాటూ మధ్య ప్రాచ్య, ఆఫ్రికా (ఎంఈఏ) మార్కెట్లలో సరఫరా చేస్తామని తెలిపారు. ఎన్సీఎల్ వెకా కంపెనీ హైదరాబాద్‌కు చెందిన ఎన్సీఎల్ గ్రూప్, జర్మనీకి చెందిన వెకా జాయింట్ వెంచర్. యూపీవీసీ విండో మార్కెట్లో ఎన్సీఎల్ వెకాకు 15 శాతం మార్కెట్ వాటా ఉంది. ఏటా 30 శాతం వృద్ధి రేటుతో 2018–19 ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి రూ.200 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. -
అధికారిక బంగ్లాలకు అఖిలేష్, ములాయం బై..
సాక్షి, లక్నో : సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా యూపీ మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ తమ అధికారిక బంగ్లాలను గురువారం ఖాళీ చేశారు. తొలుత వీరిద్దరూ బంగ్లాలను ఖాళీ చేసేందుకు తమకు రెండేళ్ల సమయం కావాలిన కోరిన సంగతి తెలిసిందే. యూపీ మాజీ సీఎంలు అందరూ అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎన్జీవో లోక్‌ప్రహరి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్ధానం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైన అఖిలేష్ తాను ఉండేందుకు మరో ఇల్లు లేదని అశక్తత వ్యక్తం చేశారు. మరోవైపు భారీ సెక్యూరిటీ, తన కోసం వచ్చే అతిధులకు సరిపోయే ఇల్లు తనకు లేదంటూ ములాయం సింగ్ యాదవ్ అధికారిక బంగ్లాలను ఖాళీ చేసేందుకు నిరాకరించారు. అయితే వీరి వాదనలను యూపీ అధికార యంత్రాంగం ఖాతరుచేయకపోవడంతో గురువారం ఇరువురు నేతలూ ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేశారు. ఇక మాజీ సీఎంలు మాయావతి, రాజ్‌నాథ్ సింగ్, కళ్యాణ్ సింగ్, ఎన్డీ తివారీలు తమకు కేటాయించిన అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాల్సి ఉంది. -
మంత్రి చూసుకుంటారు..
ఎల్లారెడ్డిపేట: సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఎల్లారెడ్డిపేటలో అఖిల పక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతుండగా దీక్ష శిబిరాన్ని గురువారం జెడ్పీటీసీ తోట ఆగయ్య సందర్శించారు. ఈ సందర్భంగా దీక్ష చేస్తున్న వారితో ఆయన మాట్లాడుతూ జిల్లా విషయం మంత్రి చూసుకుంటారని అన్నారు. దీక్షలు విరమించి మంత్రి దగ్గరికి వెళ్లి జిల్లా విషయం మాట్లాడదామని అన్నారు. దీనిపై అఖిలపక్షం నాయకులు స్పందిస్తూ జిల్లా విషయంలో మంత్రి స్పష్టమైన ప్రకటన ఇస్తేనే ఆందోళనను విరమిస్తామని తేల్చి చెప్పారు. మంత్రిపై ఒత్తిడి తేవాలని విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జెడ్పీటీసీకి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కొండ రమేశ్‌గౌడ్, డివిజన్ కన్వీనర్ రంజిత్, వాజీద్, శ్రీనివాస్, రాఖేష్, నవీన్, ప్రవీన్, బండారి బాల్‌రెడ్డి, బుగ్గారెడ్డి, దొమ్మాటి నర్సయ్య, ఎస్కే గౌస్ పాల్గొన్నారు.