చపాతీలు గుండ్రంగా చేయలేదని.. చంపేశారు! | Father kills daughter for not making round chapatis | Sakshi
Sakshi News home page

చపాతీలు గుండ్రంగా చేయలేదని.. చంపేశారు!

Published Fri, Oct 2 2015 10:34 AM | Last Updated on Thu, Aug 16 2018 4:21 PM

చపాతీలు గుండ్రంగా చేయలేదని.. చంపేశారు! - Sakshi

చపాతీలు గుండ్రంగా చేయలేదని.. చంపేశారు!

చపాతీలు గుండ్రంగా రాకపోతే ఏం చేస్తారు.. ఏదైతేనేం, కడుపులోకి వెళ్లాక అంతా ఒకటే కదా అని తినేస్తాం. అంతేకదూ. కానీ, పాకిస్థాన్లో మాత్రం అలా కాదు. పదమూడేళ్ల వయసున్న తన కూతురు చపాతీలను సరిగా చేయలేదన్న కోపంతో.. ఆమెను చంపేశాడో కసాయి కన్నతండ్రి. ఇందుకు తన కొడుకు సాయం కూడా తీసుకున్నాడు.

ఈ ఘటన ఇస్లామాబాద్లోని అజీమ్ పార్క్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అనీఖా అనే ఆ చిన్నారిని తామిద్దరం తీవ్రంగా కొట్టినట్లు తండ్రి, కొడుకు ఇద్దరూ అంగీకరించారు. దాంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే ఆమె మరణించింది. దాంతో వాళ్లు ఆమె మృతదేహాన్ని దగ్గర్లో ఉన్న పొలాల్లో పారేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement