
లక్నో: పాఠశాల ఉపాధ్యాయుడిని కాల్చి చంపిన వ్యక్తిని సోమవారం ఉదయం గ్రామస్తులు పోలీసుల సమక్షంలో కొట్టి చంపేశారు. ఉత్తరప్రదేశ్ కుషినగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిలో కొందరు వ్యక్తులు కర్రలతో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టారు. ఈ దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్న పోలీసులు గ్రామస్తులను ఆపడానికి ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. దెబ్బల దాటికి తాళలేక బాధితుడు మరణించాడు. కానీ గ్రామస్తులు మాత్రం అతడిని కొడుతూనే ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు గోరఖ్‌పూర్‌కు చెందినవాడు. కొద్ది రోజుల క్రితం అతడు తన తండ్రి తుపాకీతో ఓ ఉపాధ్యాయుడిని కాల్చి చంపాడు. అందుకు ప్రతీకారంగా గ్రామస్తులు అతడిని కొట్టి చంపేశారు. (చదవండి: ఈ అవమానాన్ని భరించలేను.. అందుకే)
Comments
Please login to add a commentAdd a comment