villagers angry
-
అర్ధరాత్రి ఎస్ఐ హల్చల్.. లాఠీలు తీసుకుని..
సాక్షి,వట్టిచెరుకూరు(ప్రత్తిపాడు): మండలంలోని కుర్నూతల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఎస్ఐ హల్చల్ చేశారు. అధికారుల అనుమతితో మట్టి తోలుకుంటున్న రైతులపై లాఠీలు ఝుళిపించారు. అదేమని అడిగిన సర్పంచ్‌నూ దుర్భాషలాడారు. లాఠీతో కొట్టారు. దీంతో గ్రామస్తుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. కుర్నూతలలోని మైనర్ ఇరిగేషన్ చెరువులో పూడిక తొలగించి ఆ మట్టితో తమ పొలాల్లో భూమిని చదును చేసుకుంటామంటూ చింతపల్లిపాడుకు చెందిన కొందరు రైతులు కొద్దిరోజుల కిందట ఇరిగేషన్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అధికారులు అనుమతులు ఇచ్చారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి చెరువులో మట్టిని పొక్లెయినర్‌తో ట్రాక్టర్లకు లోడింగ్ చేస్తున్న సమయంలో వట్టిచెరుకూరు ఎస్ఐ కోటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి అక్కడికి వచ్చారు. వస్తూవస్తూనే రైతులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ విషయం తెలుసుకుని వైఎస్సార్సీపీ సర్పంచ్ గోపాలకృష్ణ ఘటనా స్థలానికి వెళ్లారు. రైతులను అన్యాయంగా ఎందుకు కొడుతున్నారంటూ ప్రశ్నించారు. దీంతో ఎస్ఐ సర్పంచ్ గోపాలకృష్ణపైనా దుర్భాషలాడారు. ఆయననూ లాఠీతో కొట్టారు. ఎస్ఐ తీరుతో కంగుతిన్న పక్కనే ఉన్న కానిస్టేబుళ్లు సర్పంచ్‌ను కొట్టవద్దంటూ నిలురించేందుకు యత్నించినా ఎస్ఐ ఆవేశంతో ఊగిపోయారు. విషయం బయటకు రావడంతో కుర్నూతలతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు. ఇదేం పద్ధతంటూ ఎస్ఐను నిలదీశారు. ఇరిగేషన్ అధికారులు అనుమతిచ్చిన తరువాతే చెరువులో మట్టి తవ్వుకుంటున్న తమను కొట్టడం ఏంటని ప్రశ్నించారు. చేబ్రోలు సీఐ సుబ్బారావు ఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటల పాటు గ్రామస్తులతో చర్చించారు. సీఐ హామీతో గ్రామస్తులు శాంతించారు. ఎస్ఐ అడిగినట్లుగా రూ.ఐదు లక్షలు ఇవ్వనందువల్లే ఇలా చేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎస్ఐ కేవీ కోటేశ్వరరావును ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపినట్లు చేబ్రోలు సీఐ తెలిపారు. -
చెట్లను నరికేస్తున్నాడని కోపంతో చచ్చేంతవరకు కొట్టి!... చివరికి..
పర్యావరణం కోసమే కాక ఎన్నో తరాల నుంచి వస్తున్న చెట్లను నరకడం నేరం. అంతేకాకుండా చెట్లను ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ లేకుండా నరకడం అనేది కుదరదు. అటువంటిది గ్రామస్తుల నమ్మకానికి సంబంధించి పవిత్రమైన వృక్షాలను నరికితే వారు అసలు సహించరు. అయితే ఒక యువకుడు గ్రామస్తులు ఎంత చెప్పిన వినకుండా ఆ చెట్లను కలప కోసం నరికి గ్రామస్తుల ఆగ్రహానికి గురైయ్యాడు (చదవండి: వామ్మో ! కుక్కపిల్ల మాదిరి సింహాన్ని చేతులతో మోసుకుంటూ తీసుకువచ్చేసింది!!) జార్ఖండ్‌లోని సిమ్డేగా జిల్లాలోని బెసరాజ్రా గ్రామానికి చెందిన సంజు ప్రధాన్ అనే యువకుడు కలప కోసం కొన్ని చెట్లను నరికేసేవాడు. అయితే ఆ చెట్టు ఆ గ్రామంలోని నివాసితులకు పవిత్రమైన చెట్లు. పైగా వాటిని నరకడం ఆ గ్రామస్తులు దైవ దూషణగా భావిస్తారు. అంతేకాదు ఈ చెట్లు కమ్యూనిటికి చెందిన భూమిలో ఉన్నాయి. వీటిని నరకడం నిషేధం అయినప్పటికీ సంజు వీటిని నరికేసి కలపను విక్రయించేవాడు. దీంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయితే వారు పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ మేరకు సంజు మళ్లీ రెండు రోజుల క్రితం ఆచెట్లను కలప కోసం నరికేశాడు. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు సంజు ఇంటికి వెళ్లి అతన్ని చచ్చేంతవరకు కొట్టి నిప్పట్టించారు. (చదవండి: దాల్సరస్సులో అగ్నిప్రమాదం... రెండు బోట్లు దగ్ధం) -
టీడీపీ నేత దేవినేని దుష్ప్రచారం.. మండిపడ్డ గ్రామస్తులు
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ నేతల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. టీడీపీ నేత దేవినేని ఉమా తీరుపై అనాసాగరం గ్రామస్తులు మండిపడ్డారు. జగనన్న లేఅవుట్లో నీటమునిగాయని దుష్ప్రచారం చేసిన దేవినేనిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని బూటకపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. -
పోలీసుల ఎదుటే కొట్టి చంపారు
లక్నో: పాఠశాల ఉపాధ్యాయుడిని కాల్చి చంపిన వ్యక్తిని సోమవారం ఉదయం గ్రామస్తులు పోలీసుల సమక్షంలో కొట్టి చంపేశారు. ఉత్తరప్రదేశ్ కుషినగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిలో కొందరు వ్యక్తులు కర్రలతో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టారు. ఈ దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్న పోలీసులు గ్రామస్తులను ఆపడానికి ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. దెబ్బల దాటికి తాళలేక బాధితుడు మరణించాడు. కానీ గ్రామస్తులు మాత్రం అతడిని కొడుతూనే ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు గోరఖ్‌పూర్‌కు చెందినవాడు. కొద్ది రోజుల క్రితం అతడు తన తండ్రి తుపాకీతో ఓ ఉపాధ్యాయుడిని కాల్చి చంపాడు. అందుకు ప్రతీకారంగా గ్రామస్తులు అతడిని కొట్టి చంపేశారు. (చదవండి: ఈ అవమానాన్ని భరించలేను.. అందుకే) -
ఆర్టీసీ డీఎం నిలదీత
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని లింగంపేట గ్రామస్తులు శనివారం డీఎం ఆంజనేయులును గ్రామస్తులు నిలదీశారు. శనివారం ఆయన బస్టాండ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా 6 నెలలలుగా బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడంలేదని విద్యార్థులు, ప్రయాణికులు డీఎంను నిలదీశారు. తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యుత్ దీపాలు, కూర్చోవడానికి బల్లలు, బస్టాండ్‌లో ఏర్పడిన గుంతలను పూడ్చాలని పలుమార్చు మొరపెట్టుకున్నా స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బస్టాండ్ నుంచి ప్రతి సంవత్సరం దుకాణ సముదాయాలు, హోటళ్ల నుంచి ఆదాయం వస్తున్నా ఎలాంటి పనులు చేపట్టకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. బస్టాండ్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరిన గ్రామస్తులపై డీఎం మండిపడడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ప్రశ్నించే హక్కు మీకు లేదని గ్రామస్తులకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. నాపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకోండని చెప్పడంతో డీఎంపై నిరసన వ్యక్తం చేశారు. 15 రోజుల క్రితం సర్పంచ్ లావణ్య రూ. 40వేలు ఖర్చు చేసి బస్టాండ్‌ను చదును చేయించారు. బస్టాండ్‌లో కనీస వసతులు కల్పించడంతో ఆర్టీసీ అధికారులు విఫలమైనట్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సదరు డీఎంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
లోకేష్‌కు చేదు అనుభవం..
-
లోకేష్‌కు చేదు అనుభవం..
సాక్షి, తూర్పుగోదావరి : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. పెద్దాపురం మండలం కట్టమూరులో శుక్రవారం జరిగిన మంచినీటి పథకం ప్రారంభోత్సవానికి లోకేష్ హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. పచ్చనేతలకు అనుకూలమైన వారికే మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నారంటూ మహాలక్ష్మి అనే మహిళ లోకేష్‌ను నిలదీశారు. తాము నివసిస్తున్న ఐదవ డివిజన్లో రోడ్డు, మంచినీళ్లు వంటి సౌకర్యాలు లేవంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెతో పాటు పలువురు తమ సమస్యలపై ఆందోళన చేయడంతో లోకేష్ అర్థాంతరంగా సభను ముగించుకుని కట్టమూరి నుంచి వెళ్లిపోయారు. -
ఓట్ల కోసం మా ఊరికి రావొద్దు
తిరుమలాయపాలెం: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ముజాహిదిపురం గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. తమ గ్రామానికి ఏ పాలకుడూ ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలేరు నది పక్కనే ఉన్నప్పటికీ గ్రామంలోని చెరువు ఎడారిలా మారిందని, మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందుతున్నా.. తాము గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్నామని పేర్కొన్నారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేయడం చేతకానప్పుడు ఓటు అడిగే హక్కు లేదని నినదించారు. -
పోలీసును చెట్టుకు కట్టేసి చితకబాదారు
సాక్షి, చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌లో దారుణం చోటుచేసుకుంది. శాంతిభద్రతలు కాపాడాల్సిన ఓ పోలీసు అధికారే మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనికి స్థానికులు ఆగ్రహించి పోలీసును చెట్టుకు కట్టేసి చితకబాదారు. వివరాలు.. పీకలదాక మద్యం సేవించిన ఓ పోలీసు అధికారి మద్యం మత్తులో తనపై అత్యాచారం చేయబోయాడని ఓ మహిళ స్థానికులకు తెలిపింది. దీంతో స్థానికులు ఆ అధికారిని పట్టుకొని చెట్టుకి కట్టేసి చితకబాదారు. ఈ విషయం తెలుసున్న పోలీసు ఉన్నతాధికారులకు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
సోమిరెడ్డిని నిలదీసిన గ్రామస్తులు
వెంకటాచలం: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని వెంకటాచలం మండలం కసుమూరు పంచాయతీ అనకాడ వడ్డిపాళెం గ్రామస్తులు నిలదీశారు. మంత్రి సోమిరెడ్డి కసుమూరు పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం కారులో వెళ్తుండగా అనకాడ వడ్డిపాళెం వద్ద రోడ్డుపై గ్రామస్తులు నిలబడ్డారు. వారిని గమనించిన మంత్రి తన కారును నిలపగా గ్రామస్తులు ఆయన దృష్టికి తమ సమస్యలను తీసుకుపోయారు. వడ్డిపాళెంలో రోడ్లు, పారిశుద్ధ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని వాపోయారు. గ్రామ అభివృద్ధి గురించి మీరు పట్టించుకోరా?అని నిలదీశారు. సమస్యలను అనేక సార్లు స్థానిక టీడీపీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా పురోగతిలేదని ఆరోపించారు. తమ గ్రామంలో ఏం అభివృద్ధి పనులు చేశారని మహిళలు మంత్రి సోమిరెడ్డిని నిలదీయడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని పక్కకు పంపారు. అనంతరం మంత్రి కారెక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
గ్రామాలను ఖాళీ చేసేది లేదు
నక్కపల్లి (పాయకరావుపేట): భూములు ఇవ్వబోమన్నా బలవంతంగా లాక్కొన్నారు.. పరిహారమైనా సంతృప్తికరంగా ఇచ్చారా అంటే అదీ లేదు.. ప్రకటించిన పరిహారం పూర్తిగా చెల్లించలేదు.. ఇప్పుడేమో ఊళ్లు ఖాళీ చేయించడానికి గ్రామాల్లోకి వచ్చారు.. ఇదెక్కడి న్యాయమంటూ నిర్వాసితులు సోమవారం తీరప్రాంత గ్రామాల్లోకి వచ్చిన రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులపై మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోను గ్రామాలను ఖాళీ చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా మండలంలో రాజయ్యపేట, చందనాడ, అమలాపురం, వేంపాడు, బోయపాడు, మూలపర, నెల్లిపూడి, డీఎల్ రం బుచ్చిరాజుపేట తదితర గ్రామల్లో ఐదు వేల ఎకరాలను సేకరిస్తోంది. ఇప్పటికే రైతుల నుంచి రెండు వేల ఎకరాలు తీసుకుంది. ఎకరాకు రూ.18 లక్షలు పరిహారం చెల్లిస్తామని ప్రకటించడంతో రైతులు ఒప్పుకున్నారు. అన్ని లాంఛనాలు పూర్తయినప్పటికీ పరిహారం మాత్రం పూర్తిగా చెల్లించలేదు. రూ.500 కోట్లు అవసరమైతే ప్రభుత్వం కేవలం 150 కోట్లు మాత్రమే విడుదల చేసి పంపిణీ చేసింది. పరిహారం చెల్లించకపోగా గోరుచుట్టుపై రోకటి పోటు అన్నట్లు ప్రభుత్వం చందనాడ, బుచ్చిరాజుపేట, నల్లమట్టిపాలెం, తమ్మయ్యపేట, బోయపాడు గ్రామాలను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తోంది. తీవ్ర ప్రతిఘటన సోమవారం ఏపీఐఐసీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పుష్పమణి, తహసీల్దార్ రాణీ అమ్మాజీ తదితరులు ఈ గ్రామాల్లో పర్యటించి గ్రామసభలు నిర్వహించారు. గ్రామస్తుల అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేశారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తామని, ఇళ్లకు విలువ కట్టి యజమానికి ప్యాకేజీ చెల్లిస్తామని, పునరావాసం కల్పిస్తామని ఒప్పించే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటించారు. సర్పంచ్ గంటా తిరుపతిరావు తదితరులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. గతంలో భూములు తీసుకుంటామన్నారని, ఇప్పుడేమో ఇళ్లు, గ్రామాలు ఖాళీ చేయిస్తామంటున్నారని నిలదీశారు. వేరే ప్రాంతాలకు వెళ్లడం తమ వల్లకాదని స్పష్టం చేశారు. ఒకవేళ ఖాళీ చేయడం అనివార్యమయితే గ్రామస్తులంతా సమావేశమై పునరావాసంపై తమ డిమాండ్లు తెలియజేస్తామని చెప్పారు. గ్రామస్తుల అభిప్రాయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తానని డిప్యూటీ కలెక్టర్ పుష్పమణి హామీ ఇచ్చారు. బోయపాడులో మత్య్సకారులు గ్రామం ఖాళీచేయడానికి 100 డిమాండ్లు వ్యక్తం చేశారు. గ్రామాలను ఖాళీ చేయించే నిర్ణయాన్ని సీపీఎం నాయకులు వ్యతిరేకించారు. ఎం.అప్పలరాజు తదితరులు మాట్లాడుతూ గతంలో సేకరించిన భూములకు పరిహారం ఇవ్వకుండా, ఇప్పుడు గ్రామాలను తరలించాలని ప్రతిపాదించడం సమంజసం కాదన్నారు. -
ప్రార్థనా మందిరానికి పాఠశాల స్థలమా?
విజయవాడ: ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ప్రార్థనా మందిరానికి కేటాయించడాన్ని ఆ గ్రామస్తులు నిరసిస్తున్నారు. ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఈ సంఘటన విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో జరిగింది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 20 సెంట్ల భూమిని ప్రార్థనా మందిరం నిర్మించుకునేందుకు గన్నవరం ఎమ్మెల్యే వంశీ కేటాయించారు. దీంతో ఆ భూమిని పొందినవారు దాన్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నించారు. ఎమ్మెల్యే వంశీ నిర్ణయంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల స్థలాన్ని ఏ అధికారంతో మతపరమైన కార్యక్రమాలకు కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆ స్థలంలో హైస్కూల్‌కు అనుబంధంగా జూనియర్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీలను నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హైస్కూల్ గ్రౌండ్లో గ్రామస్తులు సమావేశమై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించారు. హైస్కూల్ వద్ద ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేపట్టగా పోలీసులు రంగంలోకి దిగారు. విజయవాడ సబ్ కలెక్టర్, రూరల్ తహసీల్దార్లు సంఘటనా స్థలానికి బయల్దేరి వెళ్లారు. -
అర్ధరాత్రి బాలికల కిడ్నాప్.. ఆపై అత్యాచారయత్నం
సాక్షి, వినుకొండటౌన్: అర్ధరాత్రి వేళ ఇళ్లలో నిద్రిస్తున్న బాలికలను కిడ్నాప్ చేసి అత్యాచారయత్నానికి పాల్పడుతున్న నిందితులను గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండలం శృంగారపురంలో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానిక డిగ్రీ కళాశాల సమీపంలో నివసించే షేక్ బాషా, పోలం పోలయ్య వరుసకు బాబాయ్, అబ్బాయ్ అవుతారు. వారిద్దరూ పట్టణంలోని ముట్లకుంట కాలనీ, శృంగారపురంలోని ఇళ్లలో నిద్రిస్తున్న బాలికలను అపహరించుకుపోయి అత్యాచార యత్నానికి పాల్పడుతున్నారు. పొట్టకూటి కోసం పగలంతా కాయకష్టం చేసిన తల్లిదండ్రులు అలసిపోయి అర్ధరాత్రివేళ గాఢనిద్రలో ఉన్న సమయంలో నిందితులు ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పట్టుబడింది ఇలా... ముట్లకుంట కాలనీకి చెందిన మూడో తరగతి చదువుతున్న ఓ బాలిక (8)ను పది రోజుల క్రితం అపహరించిన నిందితులు అత్యాచారానికి యత్నించినట్లు బాధిత బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. బాషా, పోలయ్య శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అదే కాలనీలోని మరో బాలికను అపహరించే ప్రయత్నం చేయగా, గుర్తించిన తల్లిదండ్రులు, బాలిక కేకలు వేశారు. దీంతో నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. అదే క్రమంలో శృంగారపురంలోని 12 ఏళ్ల మరో బాలికను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారని, బాలిక నాయనమ్మ గుర్తించి కేకలు వేయటంతో పరారయ్యారని స్థానికులు తెలిపారు. మరికొద్దిసేపటికే మరో వీధిలో నివాసం ఉండే 11 ఏళ్ల బాలికను తీసుకెళ్లే ప్రయత్నంలో నిందితులు పట్టుబడ్డారు. తొలుత బాలిక అనుకుని బాలుడిని తీసుకెళ్లబోయారు. గుర్తించి మళ్లీ బాలికను అపహరించే యత్నం చేయగా కుటుంబీకులు గుర్తించారు. కుటుంబసభ్యులు, స్థానికులంతా అక్కడికి చేరుకొని గాలించగా, పాఠశాల వద్ద నక్కి ఉన్న వీరిని గుర్తించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అప్పటికే ముట్లకుంట కాలనీ వాసులు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చారు. బాలికలు నిందితులను గుర్తించటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో బాషా పాత నేరస్తుడని, గతంలో దొంగతనం కేసులో ఇతనికి శిక్ష పడిందని పోలీసులు తెలిపారు. వీరితో పాటు వచ్చిన మరో వ్యక్తి పారిపోయినట్లు బాధితులు పేర్కొన్నారు. -
వసతిగృహాన్ని తరలిస్తే ఊరుకోం..
శ్రీకాకుళం : అక్కుపల్లి ఎస్సీ బాలుర వసతిగృహం తరలిస్తే సహించేది లేదని ఆ గ్రామస్తులు హెచ్చరించారు. ఇటీవల ప్రభుత్వం ఇక్కడ వసతిగృహం ఎత్తివేసింది. దీంతో వసతిగృహం వార్డెన్ శశిభూషణరావు బుధవారం వచ్చి అందులో ఉన్న సామగ్రి పలాస ఎస్సీ వసతిగృహానికి తరలించేందుకు పూనుకోగా అక్కుపల్లి, బైపల్లి గ్రామస్తులంతా ఏకమై అడ్డుకున్నారు. వసతిగృహం పునరుద్దరణకు ఓ పక్క తాము ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ విషయం పలాస ఎమ్మెల్యే దృష్టిలో ఉందన్నారు. అయినా తమకు సమాచారం లేకుండా వార్డెన్ గుట్టుగా సామగ్రి తరలించడంతో గ్రామస్తులు మండిపడ్డారు. వార్డెన్‌ను నిలదీశారు. మాజీ ఎంపీపీ ఎస్.మోహనరావు, వైఎస్సార్సీపీ మండల అధికార ప్రతినిధి ఎం.రాంప్రసాద్, శ్రీరామాసేవా సంఘం అధ్యక్షుడు బర్రి పురుషోత్తం ఆధ్వర్యంలో వసతిగృహానికి మరో తాళం వేసి తమకు తెలియకుండా ఇక్కడ నుంచి ఏ వస్తువూ తరలించడానకి వీల్లేదని వార్డెన్ శశిభూషణరావుకు స్పష్టం చేశారు. అనంతరం ఆ శాఖ డీడీతో మాట్లాడారు. పాఠశాల సముదాయ చైర్మన్ ఎం.శేఖర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.