ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. పెద్దాపురం మండలం కట్టమూరులో శుక్రవారం జరిగిన మంచినీటి పథకం ప్రారంభోత్సవానికి లోకేష్ హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. పచ్చనేతలకు అనుకూలమైన వారికే మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నారంటూ మహాలక్ష్మి అనే మహిళ లోకేష్‌ను నిలదీశారు.