లోకేష్‌కు చేదు అనుభవం.. | People Protest Against Nara Lokesh In East Godavari | Sakshi
Sakshi News home page

లోకేష్‌కు చేదు అనుభవం..

Jan 11 2019 2:52 PM | Updated on Jan 11 2019 3:27 PM

People Protest Against Nara Lokesh In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. పెద్దాపురం మండలం కట్టమూరులో శుక్రవారం జరిగిన మంచినీటి పథకం ప్రారంభోత్సవానికి లోకేష్‌ హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. పచ్చనేతలకు అనుకూలమైన వారికే మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నారంటూ మహాలక్ష్మి అనే మహిళ లోకేష్‌ను నిలదీశారు. తాము నివసిస్తున్న ఐదవ డివిజన్‌లో రోడ్డు, మంచినీళ్లు వంటి సౌకర్యాలు లేవంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెతో పాటు పలువురు తమ సమస్యలపై ఆందోళన చేయడంతో లోకేష్‌ అర్థాంతరంగా సభను ముగించుకుని కట్టమూరి నుంచి వెళ్లిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement