పర్యావరణం కోసమే కాక ఎన్నో తరాల నుంచి వస్తున్న చెట్లను నరకడం నేరం. అంతేకాకుండా చెట్లను ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ లేకుండా నరకడం అనేది కుదరదు. అటువంటిది గ్రామస్తుల నమ్మకానికి సంబంధించి పవిత్రమైన వృక్షాలను నరికితే వారు అసలు సహించరు. అయితే ఒక యువకుడు గ్రామస్తులు ఎంత చెప్పిన వినకుండా ఆ చెట్లను కలప కోసం నరికి గ్రామస్తుల ఆగ్రహానికి గురైయ్యాడు
(చదవండి: వామ్మో ! కుక్కపిల్ల మాదిరి సింహాన్ని చేతులతో మోసుకుంటూ తీసుకువచ్చేసింది!!)
జార్ఖండ్‌లోని సిమ్‌డేగా జిల్లాలోని బెసరాజ్రా గ్రామానికి చెందిన సంజు ప్రధాన్ అనే యువకుడు కలప కోసం కొన్ని చెట్లను నరికేసేవాడు. అయితే ఆ చెట్టు ఆ గ్రామంలోని నివాసితులకు పవిత్రమైన చెట్లు. పైగా వాటిని నరకడం ఆ గ్రామస్తులు దైవ దూషణగా భావిస్తారు. అంతేకాదు ఈ చెట్లు కమ్యూనిటికి చెందిన భూమిలో ఉన్నాయి. వీటిని నరకడం నిషేధం అయినప్పటికీ సంజు వీటిని నరికేసి కలపను విక్రయించేవాడు. దీంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయితే వారు పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ మేరకు సంజు మళ్లీ రెండు రోజుల క్రితం ఆచెట్లను కలప కోసం నరికేశాడు. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు సంజు ఇంటికి వెళ్లి అతన్ని చచ్చేంతవరకు కొట్టి నిప్పట్టించారు.
Comments
Please login to add a commentAdd a comment