Trees Cut
-
చెట్లను నరికేస్తున్నాడని కోపంతో చచ్చేంతవరకు కొట్టి!... చివరికి..
పర్యావరణం కోసమే కాక ఎన్నో తరాల నుంచి వస్తున్న చెట్లను నరకడం నేరం. అంతేకాకుండా చెట్లను ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ లేకుండా నరకడం అనేది కుదరదు. అటువంటిది గ్రామస్తుల నమ్మకానికి సంబంధించి పవిత్రమైన వృక్షాలను నరికితే వారు అసలు సహించరు. అయితే ఒక యువకుడు గ్రామస్తులు ఎంత చెప్పిన వినకుండా ఆ చెట్లను కలప కోసం నరికి గ్రామస్తుల ఆగ్రహానికి గురైయ్యాడు (చదవండి: వామ్మో ! కుక్కపిల్ల మాదిరి సింహాన్ని చేతులతో మోసుకుంటూ తీసుకువచ్చేసింది!!) జార్ఖండ్‌లోని సిమ్డేగా జిల్లాలోని బెసరాజ్రా గ్రామానికి చెందిన సంజు ప్రధాన్ అనే యువకుడు కలప కోసం కొన్ని చెట్లను నరికేసేవాడు. అయితే ఆ చెట్టు ఆ గ్రామంలోని నివాసితులకు పవిత్రమైన చెట్లు. పైగా వాటిని నరకడం ఆ గ్రామస్తులు దైవ దూషణగా భావిస్తారు. అంతేకాదు ఈ చెట్లు కమ్యూనిటికి చెందిన భూమిలో ఉన్నాయి. వీటిని నరకడం నిషేధం అయినప్పటికీ సంజు వీటిని నరికేసి కలపను విక్రయించేవాడు. దీంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయితే వారు పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ మేరకు సంజు మళ్లీ రెండు రోజుల క్రితం ఆచెట్లను కలప కోసం నరికేశాడు. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు సంజు ఇంటికి వెళ్లి అతన్ని చచ్చేంతవరకు కొట్టి నిప్పట్టించారు. (చదవండి: దాల్సరస్సులో అగ్నిప్రమాదం... రెండు బోట్లు దగ్ధం) -
20,000 చెట్లపై హైవేటు
సాక్షి, హైదరాబాద్ : అభయారణ్యంలో చెట్లు బిక్కుబిక్కుమంటు న్నాయి. హైవే విస్తరణకు అవి బలికానున్నాయి. వనం గుండా జనం వెళ్లేందుకుగాను వృక్షాలపై వేటు వేయనున్నారు. నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో 83 చ.కి.మీ. పరిధిలో (దాదాపు 20 వేల ఎకరాల్లో) యురేనియం తవ్వకాలకు రంగం సిద్ధం అవుతున్న తరుణంలోనే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జోన్ పరిధిలో మరో ఉపద్రవం ఎదురుకానుంది. రోడ్డు విస్తరణపేరిట పులుల అభయారణ్యంలోని నేష నల్ హైవే 765 మీదుగా దాదాపు 60 కి.మీ. పరిధిలో 20 వేల చెట్ల వరకు నేలకూలనున్నాయి. మార్కింగ్‌లు పూర్తి... నేషనల్ హైవేస్ అథారిటీ ఆధ్వర్యంలో తోకపల్లి నుంచి హైదరాబాద్ వరకు చేపడుతున్న రోడ్డుప్రాజెక్టులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా వేలాది చెట్లు కొట్టేందుకు రాష్ట్ర అటవీశాఖ నేతృత్వంలో మార్కింగ్‌లు కూడా పూర్తయ్యాయి. ఆమ్రాబాద్ పులుల అభయార ణ్యం మీదుగా శ్రీశైలంకు వెళ్లే మార్గం ఇరుకుగా ఉన్న నేపథ్యంలో రోడ్డు విస్తరణ చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ నుంచి రాష్ట్ర అటవీశాఖకు అయిదారు నెలల కిందటే ప్రతిపాదనలు అం దాయి. వీటిని నాగర్‌కర్నూల్ జిల్లా అటవీ అధి కారులకు అటవీశాఖ పంపించింది. ఈ ప్రతి పాదనలకు అనుగుణంగా ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ నివేదికను సిద్ధం చేసింది. మరో వారం, పదిరోజుల్లోనే ఈ నివేదికపై మళ్లీ జిల్లా అటవీ అధికారి, డీఎఫ్‌వో, ఫీల్డ్ ఆఫీసర్లు వాల్యువేషన్ రిపోర్ట్‌ను సిద్ధం చేసి రాష్ట్ర అటవీ శాఖకు పంపిస్తారు. ఇక్కడి నుంచి రాష్ట్ర వన్యప్రాణి బోర్డుకు, కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు, కేంద్ర వన్యప్రాణిబోర్డుకు ఈ నివేదికలు పంపించాక, ఈ ప్రాజెక్టు ఎప్పుడు ‘ప్రారంభించాలనే దానిపై నేషనల్ హైవేస్ అథారిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా ఎన్ని వేల చెట్లు పోతాయి, వాట విలువ ఏమిటీ, అడవి ఏ మేరకు నష్టపోతుంది, దెబ్బతినే అటవీ భూమి విస్తీర్ణం ఎంత తదితర వివరాలను ఈ నివేదికలో జిల్లా అటవీ అధికారులు పొందుపరుస్తారు. తదనుగుణంగా డబ్బు రూపంలో ఎంత పరిహారమివ్వాలి, కోల్పోయిన అటవీభూమికి ఇతర భూములు ఎక్కడ ఎన్ని ఎకరాల మళ్లించాలి.. తదితర అంశాలపై నేషనల్ హైవే నిర్ణయం తీసుకుంటుంది. శని, ఆదివారాల్లోనే రద్దీ... శ్రీశైలంకు వెళ్లే వాహనాల రద్దీ శని, ఆదివారాల్లోనే ఎక్కువగా ఉంటుందనేది అటవీ శాఖ అధికారుల అంచనా. మామూలు రోజుల్లో ఈ దారిలో వెళ్లే వాహనాల సంఖ్య వెయ్యిలోపే ఉంటుందని, వీకెండ్స్, సెలవురోజుల్లో రెండున్నర వేల వరకు వీటి సంఖ్య ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల రోడ్డు విస్తరణతో అడవికి నష్టం చేయడం సరికాదని పర్యవరణవేత్తలు కూడా సూచిస్తున్నారు. విస్తరణ ఎందుకు? ఇరుకైన సింగిల్ రోడ్డు వల్ల శ్రీశైలం దేవస్థానానికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని నేషనల్ హైవేస్ అథారిటీ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ రోడ్డులో మూలమలుపులు ఉన్నందున ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని విస్తరణ ద్వారా సరిచేయాలని తెలిపింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మన్ననూరు గ్రామం నుంచి శ్రీశైలం దేవాలయానికి వెళ్లేందుకు ఉన్న శ్రీశైలం బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణ చేపడతారు. దోమలపెంట గ్రామం వద్ద ఈ రోడ్డు ముగుస్తుంది. ఈ 60 కి.మీ. పరిధి అంతా కూడా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలోనే ఉంది. రోడ్డు వెడల్పు వల్ల అడవికి, వేలాది చెట్లకు, జంతువులకు, పులుల అభయాణ్యానికి నష్టం జరుగుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. వాహనాలు పెరిగి కాలుష్య ప్రభావం కూడా ఈ టైగర్ రిజర్వ్‌పై పడుతుంది.వాహనాల వేగం పెరిగి జంతువులు ప్రమాదాల బారిన పడే అవకాశం పెరుగుతుంది. -
చెరువుకట్టపై అక్రమంగా చెట్లు నరికివేత
అనుమసముద్రంపేట : మండలంలోని శ్రీకొలను చెరువుకట్టపై ఉన్న సుమారు 30 వేప చెట్లను కొందరు వ్యక్తులు అక్రమంగా కొట్టి తరలించేందుకు సిద్ధంగా ఉంచారు. విషయం తెలుసుకున్న ఆగ్రామ వైఎస్సార్సీపీ నాయకులు బోయిళ్ల చెంచురెడ్డి సంబందిత డీఈకి ఫోను ద్వారా సమాచారం అందించారు. ఆయన మాట్లాడుతూ చెరువు కట్టపై రూ.50 వేలు విలువ చేసే వేపచెట్లు ఉన్నాయన్నారు. వాటిపై కన్నేసిన కొందరు వ్యక్తులు అక్రమంగా గత మూడురోజులుగా నరుకుతున్నారన్నారు. సంబంధిత అధికారులు ఎందుకు నిమ్మకునీరెత్తినట్లున్నారని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాగా ఈ దీనిపై పీడబ్ల్యూడీ డీఈ రవి మాట్లాడుతూ చెట్లు నరికేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదన్నారు. అక్రమంగా చెట్లు నరికితే చర్యలు తీసుకుంటామన్నారు. నీటి సంఘం అధ్యక్షులు నంది వివేకానందరెడ్డి మాట్లాడుతూ చెరువుకట్ట వద్ద చెట్లు కొన్ని నరికారని తెలిసిందని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. -
ఓవైపు పెంచుడు.. మరోవైపు నరుకుడు
- ముఖ్యమంత్రి ఆశయానికి తూట్లు - యథేచ్ఛగా చెట్లు నరికివేత - సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు - కలప లారీకి నామమాత్రంగా రూ.2 వేలు జరిమానా బషీరాబాద్: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఓవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమం ప్రారంభించగా.. మరోవైపు అక్రమార్కులు చెట్లను నరికి సొమ్ముచేసుకుంటున్నారు. సర్కార్ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో మొక్కలను నాటే కార్యక్రమం ప్రారంభిస్తే బషీరాబాద్‌లో రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో అక్రమార్కులు చెట్లను నరికి తరలించారు. అధికారులు మాత్రం నామమాత్రంగా రూ. 2 వేల జరిమానా విధించి కలప లారీని పంపించడం పలు విమర్శలకు తావిస్తోంది. వివరాలు.. బషీరాబాద్‌లోని ఇందర్‌చెడ్ మార్గంలోని ఈద్గా వెనుకాల ఓ లారీలో కలపను లోడ్ చేస్తున్నారు. పలు గ్రామాల నుంచి చెట్లను నరికి ట్రాక్టర్లలో లారీ వద్దకు తీసుకువచ్చి లోడ్ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో అక్రమార్కులు ఈ తతంగం నడిపించినా అధికారులకు తెలియకపోవడం గమనార్హం. బషీరాబాద్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు గమనించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వీఆర్వోలు నామమాత్రంగా రూ.2 వేలు జరిమానా వేసి త్వరగా లోడు తరలించాలని అక్రమార్కులకు సలహా ఇచ్చి వెళ్లడం గమనార్హం. శుక్రవారం ఉదయం మొక్కలు నాటాలని పాఠశాల నుంచి ర్యాలీ తీశామని, మరోవైపు అక్రమార్కులు చెట్లను నరికి తరలించుకుపోతే పట్టించుకునే వారేలేరని విద్యార్థులు అసహనానికి గురయ్యారు. అధికారులు అండదండలు! అక్రమార్కులు అధికారుల అండదండలతోనే చెట్లను నరికి సొమ్ముచేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం ముండల పరిధిలోని పలు గ్రామాల నుంచి లారీల్లో కలప తరలించుకుపోతున్నా ఇటు అటవీశాఖ అధికారులు గాని, అటు రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతరించి పోతున్న అడవి.. మండల పరిధిలో ఉన్న అటవీప్రాంతం రోజురోజుకూ అంతరించుకుపోతోంది. ఫారెస్టు అధికారులు అడవులను పర్యవేక్షణ మరిచి తాండూరు రేంజ్ కార్యాలయంలోనే ఉంటూ టైమ్‌పాస్ చేస్తున్నారని మండలవాసులు ఆరోపిస్తున్నా రు. గతంలో మైల్వార్, నీళ్లపల్లి గ్రామా ల్లో కొందరు చెట్లను నరికి పొలం చదునుచేసి సాగుచేసుకోవడం.. ఫారెస్టు అధికారుల పనితీరుకు నిదర్శనం. రూ.2వేలు జరిమానా వేశాం బషీరాబాద్ శివారులో లారీలో కలపను తరలిస్తున్నారనే సమాచారంతో వీఆర్ఓలను పంపించాం. రూ. 2 వేల జరిమానా కూడా విధిం చాం. మా అధికారులే దగ్గరుండి కలప లోడ్‌ను పంపించారనే విషయం నా దృష్టికి రాలేదు. -భిక్షపతినాయక్, తహసీల్దార్, బషీరాబాద్